• Ramaneeyam Telugu Book
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 103.2
    114
    9.47% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రమణీయం

    Ramaneeyam Telugu Book

    Pages: 215
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పూజ్య సాహితీ మిత్రులు, శ్రీయుతులు డా. ఎమ్. వి. రమణారావు గారు బహుశః ఒక మంచి డాక్టరుగానే అధిక సంఖ్యాకులకు సుపరిచితులనుకుంటాను. వీరిలో ఒక ఉత్తమస్థాయి రచయిత,కళాకారుడు, విమర్శకుడు, సంస్కర్త, మానవతావాది పాత్రలు గుప్తంగా వున్నాయని వీరు రచించిన 'రమణీయం' చూశాక గాని నాకవగతం కాలేదు.

తన పేరు కలిసొచ్చేటట్లు ఈ రచనకు 'రమణీయం' అని నామకరణం చేసినట్లు రచయిత పేర్కొన్నా, తన పేరుతో బాటు తనలో బహుముఖీనమైన ప్రజ్ఞా విశేషాలకు అద్దం పట్టినట్లు రూపొందించిన దీనిలో కమనీయ కవితావిలాసం, స్తవనీయ వివేచన వైభవం, నిత్యనూతనమైన విమర్శనా సంవిధానం, సమస్యా పరిష్కారానికి దిశానిర్దేశం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

'ఆకాంక్ష'తో ప్రారంభమై 'భరతభూమి'తో ముగిసిన 43 కవితా ఖండికలు 24 వచన రచనలు మొత్తం 67 శీర్షికలున్నాయి. 4 సమీక్షలు, 4 వ్యాసాలు, 2 గల్పికలు, 9 కథలు, జ్ఞాపకాలు, 2 యాత్రారచనలు, రచయిత మనవి, కళలు, వాటి ప్రయోజనాలు వంటివి దీనిలో చోటు చేసుకున్నాయి.

'రమణీయం' లోని ప్రతీ రచనలోనూ రచయితా కవితా తత్త్వం, రమణీయకత, సాహిత్య స్థాయి, ఔచిత్య సౌందర్యం తొణికిసలాడేలా రసభావబంధురంగా రచయిత ప్రతిభా విశేషాలు ముద్రవేసుకోడం సర్వదా సర్వథా ప్రశంసా పాత్రం. ఇందుకు వీరిని మనసారా అభినందిస్తున్నాను.

- భావశ్రీ

Preview download free pdf of this Telugu book is available at Ramaneeyam Telugu Book