• Ramanaiah Chaatuvulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రమణయ్య చాటువులు

    Ramanaiah Chaatuvulu

    Publisher: Palapitta Books

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీరమణయ్య గారు వృత్తిరీత్యా తెలుగు పండితులు. కవనము చెప్పుట వీరి ప్రవృత్తి. సాహిత్యమనిన పద్యమనిన వీరికి ప్రాణమని వీరి మొదటి పరిచయముతోనే నేను తెలిసికొంటిని. ఈయన సహృదయులు. సరళ స్వభావులు. కవి హృదయులు. ఆడంబరములేని శైలి ఇతనిది. అందరికీ అర్థమగు భాషలో కవిత చెప్పగల సమర్థులు. కాలగమనమును అనుసరించినచో పద్యము చదివి అర్థము చేసుకొనువారు అరుదుగా కనిపించెదరు.

ఇతనికి భావ శబలత కలదు. కవిత్వము భగవంతుడిచ్చిన వరము. ఇది ఒక శతకము. ఈ శతకము నందలి 'రమణ సుగుణధామ రామచంద్ర' అన్న మకుటము మిక్కిలి రమణీయముగా నున్నది. ఇప్పుడిప్పుడే శతకములు వ్రాయుట అధికమగుచున్నది. ఈ శతకము నందలి పద్యములు తమంతట తాము వచ్చినవి. అదే పనిగా పద్యము వ్రాయవలెననిన అది జరుగని పని. ఈ పద్యములందలి ధార ప్రవాహము వలె సాగిపోవు చుండును. ఎక్కడనూ ఆగదు. కథా వస్తువు లోకాభిరామాయణము. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టములు, సమస్యలు చక్కగా ప్రస్తావింపబడినవి. రాజకీయ నేతల దురాగతములు మొదలుగా గల విషయములు పొందుపరుచబడినవి.

మచ్చునకొక పద్యము
''రొట్టె తినుటకైన రోటి పచ్చడి లేదు
పచ్చగడ్డి లేదు పశువులకును
పచ్చ నోట్లు మెక్కి బలిసిరి నేతలు
రమణ సుగుణ ధామ రామచంద్ర''

ఈ పద్యము హృదయంగమమైనది. ఇట్టి పద్యములు యీ పుస్తకమునందు బహుళములు. ఈతడు ఆశువుగా కవిత్వము చెప్పగల వాడని చెప్పుట ముదావహము. ఈ శతకము పాఠకుల సహృదయుల మన్నన పొందగలదనుటలో సందేహము లేదు.

- గుండ్లూరు నారాయణ

Preview download free pdf of this Telugu book is available at Ramanaiah Chaatuvulu