• Ramabai Ambedkar Jeevita Charitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రమాబాయి అంబేడ్కర్‌ జీవితచరిత్ర

    Ramabai Ambedkar Jeevita Charitra

    Pages: 52
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మూలం: శాంతి స్వరూప్‌ బౌద్ధ్‌

అనువాదం: డా. జి. వి. రత్నాకర్‌

శతాబ్దాలుగా వర్గ వర్ణ విభజనలతో అతలాకుతలంగా వున్న భారత సమాజ ధర్మాన్ని ప్రశ్నించి నిలదీసి సమధర్మం, సమన్యాయం ఏర్పాటుచేసిన మహనీయుడు డా. అంబేడ్కర్‌. ఆయన భార్య రమాబాయి జీవన గమనాన్ని అర్థం చేసుకుంటే, ఆమె కూడా ఆయన మార్గాన్నే ఆమోదించినట్లు స్పష్టపడుతుంది. పోరాటాలకు, త్యాగాలకు, బాధలు భరించటానికి మనిషి సిద్ధంగా వుండాలనేవాడు అంబేడ్కర్‌. ఆ మాటలను రమాబాయి తన జీవితానికి ఎంతగా అనువర్తింప జేసుకున్నదో ఈ పుస్తకం విశదపరుస్తున్నది….

అట్టడుగు వర్గాలకు సంబంధించి భర్తల ఆదర్శాలు అర్థం చేసుకొని సహకరించవలసివచ్చే భార్యల కష్టాలు కొన్ని అయినా ఈ కథనంలో తెలుస్తున్నాయి….

అనుకూలవతి అయిన భార్య లభించటం పురుషుని అదృష్టం అని తెలిసినా దానిని ఒప్పుకోని సమాజం, అంబేడ్కర్‌ జీవితంలో రమాబాయి పాత్ర గురించి ఎక్కువ ఆలోచించనివ్వలేదు. రమాబాయిని అర్థం చేసుకునే దిశగా ఆలోచనలు సాగలేదు. ఇప్పుడు ఆమె గురించి ఆలోచిస్తుంటే ఎన్నెన్నో భావాలు మనసును గందరగోళ పరుస్తున్నాయి.

- డా. బి. విజయభారతి

* * *

'' రమాబాయి ఏ రకమైన ప్రలోభాలనూ తన దరిదాపుల్లోకి రానీయలేదు. ఔను, మా బతుకుదారులు మాకున్నాయి అన్నట్టు తన భర్త బారిష్టరైనా తాను పేడ ఎత్తి పిడకలు చేసి సంసారాన్ని ఎల్లదీసింది. ఆమె తన బాధ్యతను నెరవేర్చాననుకుంది కానీ తనకు తెలియకుండానే ఈ అవినీతిమయమైన, పురుషాధిక్య వ్యవస్థను ధిక్కరించింది. ఆత్మగౌరవ ప్రకటన చేసింది. అందుకే రమాబాయి తన ఇంటికే కాదు... ఒక ప్రపంచ మేధావిని తీర్చిదిద్ది ఈ దేశానికే దీపమయిందని అనలేమా? ఆ మనస్తత్వం మానసిక ధైర్యం మనకు లేవా? లేకుంటే అలవర్చుకోవాలి. తప్పదు మరి...''

- గోగు శ్యామల

Preview download free pdf of this Telugu book is available at Ramabai Ambedkar Jeevita Charitra