• Raiturayalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రైతురాయలు

    Raiturayalu

    Pages: 67
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రముఖ రచయిత గోపిని కరుణాకర్ వ్రాసిన "గోపినోళ్ళ చెరువు" కథకి పద్యరూపం ఈ "రైతురాయలు". ఈ కథ దీపం చెప్పిన కథలు సంకలనంలోనిది.

* * *

వచన కథను అందంగా అనుసృజించిన ఛందోబద్ధ పద్య కవితాకృతి ఈ కృతి. వచన కథను వచనంలోనే చదువుకోవచ్చును కదా - దీనికి మళ్లీ ఛందో బంధనాలూ బిగింపులూ ఎందుకు?

వచనాన్ని ఎంత సరళ సుందరంగా పలికించవచ్చో - పద్యాన్నీ అంత సులభ సుందరంగా నడిపించవచ్చనడానికి ఈ కృతి మంచి ఉదాహరణ. పూర్వకాలం నుంచీ మనకు పద్యమే కథలు చెపుతూ వస్తున్నది. రామాయణ, భారత, భాగవతాది మన ప్రాచీన వాఙ్మయములోని ఐతిహాసిక కథలన్నిటినీ పద్యమే చెప్పింది. అది చరిత్ర కథనమైనా, సామాజిక సమస్యాత్మక ఇతివృత్తమైనా - వచనంలో చెపితే ఒక ఇంపు. పద్యం కట్టి చెప్పినా అదిన్నీ ఒక సొంపు.

వచనమూ, పద్యమూ - ఏ ప్రక్రియలోనైనా స్వాదు సుందరంగా కలాన్ని నడిపించగల కవి - రచయిత - చంద్రశేఖరరెడ్డి. అనువాదాలూ, అనుసృజనలూ చేయడంలో చేయి తిరిగిన దిట్టరితనం ఉంది. అందుకే ఈ 'రైతురాయలు' ఒక పువ్వుల రథంలా లయ విన్యాసంతో సాగిపోతుంది.

- సి. వేదవతి

Preview download free pdf of this Telugu book is available at Raiturayalu