• Raabandula Rekkala Matuna
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాబందుల రెక్కల మాటున

    Raabandula Rekkala Matuna

    Author:

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''మిస్‌ నిర్వీ!... మాకు నీ సహాయంకావాలి. నీ లాంటి ఒక నటి సహాయం కావాలి. ప్రస్తుతం మనదేశం ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్‌ చేస్తుందో మీకు తెలియందికాదు. పాకిస్తాన్‌ మనదేశం పట్ల అసూయ, కక్షని పెంచుకొంది. మనదేశంలో అలజడులు రేపడానికి టెర్రరిస్టులను తయారు చేసి పంపుతోంది. ఆ విషయాలమీద మీకు ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు. మనదేశం తరపున నిర్వహిస్తున్న ఓ ఇంపార్టెంట్‌ ఆపరేషన్‌లో మిమ్మల్ని ఓ కీ రోల్‌ ధరించమంటున్నా. అది సినిమా మాత్రం కాదు. ఒకవేళ మీరు మా ప్రపోజల్‌ని తిరస్కరించినా మీ ఛార్జీలన్నీ మేమే భరిస్తాం. ఏమో, ఎవరికి తెలుసు? ఏదోఒకరోజున సినీఫీల్డ్‌ ఈ ఆపరేషన్‌ని సినిమాగా తీయవచ్చేమో...? అందులో మీ పాత్రని మిమ్మల్నే పోషించమని అడగవచ్చేమో...? ఇలా ఎప్పుడూ ప్రపంచ సినీచరిత్రలో జరగలేదు. ఒక నటిని తన నిజజీవితంలోని పాత్రని తెరపై నటించమని అడగడం... ఇక నిర్ణయించుకోవలసింది మీరు...'' అంటూ ఆగి ఆమె రియాక్షన్‌కోసం వెయిట్‌ చేశాడు.

ఆమె మాటల్లో, ముఖంలో తడబాటు స్పష్టంగా కానవచ్చింది.

''నాకేమీ అర్ధం కావడంలేదు... అంతా అయోమయంగా వుంది. నేనాపని చెయ్యగలనా? అసలు నేనేం చెయ్యాలో నాకే తెలియదే! మీరు దేని గురించి మాట్లాడుతున్నారో కూడా తెలియడంలేదు. కనీసం నేను మామూలు నటిని కూడా కాదు.''

''అది పొరబాటు నిర్వీ! నువ్వు మంచినటివి. మహానటివి! అయితే అందుకు కావలసిన అవకాశం నీకు ఇప్పటివరకూ రాలేదు. ఆ అవకాశం ఇప్పుడు లభించబోతోంది. అది సినిమాలోకాదు, నిజజీవితంలో! అది నిజం. ఇప్పుడు చెప్పు...!''

నిర్వికి అంతా షాక్‌గావుంది. ఆమె అసలు ఏమాత్రం ఎక్స్‌పెక్ట్‌ చెయ్యని సన్నివేశం అది! తనేం వింటున్నదో, మాట్లాడుతున్నదో తెలియని ఉద్వేగంలో వుందామె. కొన్ని క్షణాల పాటు మాటల కోసం వెదుక్కుని అప్పుడు అన్నదామె.''నేను... నేను ఏం చెయ్యాల్సి వుంటుంది?''

''నేను నీతోఫ్రాంక్‌గా చెబుతున్నాను. ఇది డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా క్రింద సీక్రెట్‌ ఆపరేషన్‌. బాగా అతిముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే ఈ పాక్‌ ఆపరేషన్‌ గురించి తెలుసు. మనకు బాగా కావలసిన ఓ వ్యక్తి పాకిస్తాన్‌ నుంచి ఇండియా చేరుకోవాలి. అందులో మనం సక్సెస్‌ అయితే పాకిస్తాన్‌ మనదేశం మీద పన్నుతున్న కుట్ర బయటపడుతుంది.''

Preview download free pdf of this Telugu book is available at Raabandula Rekkala Matuna