• Raa Raa Maa Intidaka
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రా రా మా ఇంటిదాకా

    Raa Raa Maa Intidaka

    Pages: 254
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఎస్‌ఐ గారూ రమ్మంటున్నారు" కానిస్టేబుల్ మాటలు లీలగా వినిపించాయి.

లేవటానికి ప్రయత్నించాడు గానీ వీలయ్యింది కాదు. గోడను ఆసరాగా చేసుకుని బలవంతం మీద పైకి లేచాడు, నడుస్తుంటే ఎముకలు విరిగిపోయినట్లు బాధ కలక్కుమంటోంది. ఎస్‌ఐ కెదురుగా వెళ్ళి నిలుచున్నాడు చిట్టిబాబు.

"ఇప్పటికయినా ఏం జరిగిందో చెప్పు తంబీ! నిరంజన్‌ని ఎందుకు చంపావ్?" శరవణన్ అడిగాడు.

భోరున ఏడ్చేశాడు చిట్టిబాబు. కళ్ళనీళ్లతో తనమీద పడిన నేరాన్ని కడిగేసుకోవాలన్నంతగా ఏడ్చాడు.

"అది ఎన్నప్పా? నేను అడిగినదానికి ఏడుపు జవాబుకాదే" శరవణన్ అన్నాడు.

"సార్... ఎందుకు నన్నిలా హింసిస్తారు? నాకేమీ తెలియదు. నిన్న రాత్రి నేను సుధాకర్ రూమ్‌లో వున్నాను. అక్కడ నుంచి నేరుగా ఇంటికొచ్చేశాను. కావాలంటే సుధాకర్‌ని విచారించండి సార్! ఇందుకు సాక్ష్యం అతనే" చిట్టిబాబు ఏడుస్తూ చెప్పాడు.

"మా దగ్గర అంతకంటే బలమైన సాక్ష్యం వున్నదప్పా. నువ్వు కావాలంటే చూపిస్తాను"

"ఏమిటిసార్ అది?"

"రాప్పా చూపిస్తాను" అని శరవణన్ పైకి లేచాడు. ఎదురుగా వున్న మరో రూమ్ లోకి నడిచాడు. కానిస్టేబుల్ చిట్టిబాబుని కూడా ఆయన వెనకే తీసుకెళ్ళాడు.