• Pruthvi Surabhi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పృథ్వీసురభి

    Pruthvi Surabhi

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ రాసిన సుభ అనే కథ చేత ప్రభావితులై, దాన్ని ఒక ఖండకావ్యంగా రాశారు పింగళి వెంకట శ్రీనివాసరావు గారు. మూల కథలో, చివరలో ఒక మార్పు చేసి తన భావాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. మూల కథలో సుభకున్న ప్రధాన పాత్రతత్త్వాన్ని అనుసృజన చేసి, కావ్యంలో గోవు పాత్రకు మార్చి ప్రబోధమనే వ్యక్తీకరణను నిండుగా చేశారు.

క్లుప్తంగా చెప్పాలంటే ఈ గ్రంథంలోని కథ ఇది. ఒక అందమైన పధ్నాలుగేళ్ళ అమ్మాయి. పేరు సుభాషిణి. కానీ మూగపిల్ల. తన దుస్థితిని తలచకుని నిరంతరం దుఃఖిస్తూండేది. ఒక పున్నమినాటి నడిరేయి ఒంటరిగా ఇల్లు విడిచి విరక్తితో వెళుతూ, త్రోవలో ఒక గోశాల సమీపంలో ఉన్న రాతితిన్నెపై ఖిన్నురాలై కూర్చుంటుంది. తన దీనదశను, తల్లిదండ్రులకు తన వలన కలితున్నఆత్మక్షోభను తలచుకుని దీనంగా విలపిస్తున్న ఆ బాలికను ఒక వెల్లటావు సమీపించి, ఆప్యాయతతో కన్నీరు తుడిచి అనునయిస్తుంది. ఆ బాలికకు ధైర్యం చెబుతూ, భారతీయ తత్త్వ రహస్యాన్ని, ఈశ్వర కృపా మహత్యాన్ని బోధిస్తుంది. తానే విశ్వాత్మనని చెబుతూ అనంతమైన తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన విధంగా గీతాసారాన్నంతా ఆ అమ్మాయికి ఉపదేశించి ఆ గోవు దుఃఖోపశమనం చేస్తుంది. అప్పుడా బాలిక సంభ్రమాశ్చర్యాలతో వినయంగా గోమాతకు నమస్కరిస్తుంది. గోమాత అనుగ్రహం వల్ల ఆ పిల్లకు మాటలు వస్తాయి. అప్పుడా బాలిక అద్భుతమైన వాగ్ధారతో ఆ గోమాతను కవిత్వరూపంలో స్తుతిస్తుంది.

ఎన్నో లోకోక్తులతో, నుడికారాలతో, అలంకారలతో ధారాపాతంగా సాగిన కావ్యం "పృథ్వీసురభి".

Preview download free pdf of this Telugu book is available at Pruthvi Surabhi