• Premaabhimanalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమాభిమానాలు

    Premaabhimanalu

    Publisher: Ramyabharathi

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి రచయితకూ పరిమితులుంటాయి. తెలిసిన ప్రపంచమూ, తెలిసిన బతుకులూ, తెలిసిన బాధావ్యథలూ వుంటాయి. ఒక దృష్టికోణం వుంటుంది. ఆ పరిధిలో మాత్రమే ఫలానా రచయిత ఫలానా కథ రాయగలడు. ఇది వాస్తవస్పృహ, యదార్థ విషయం!

ఈ యధార్థాన్ని తెలుసుకుని కథల్ని చదివి ఆనందించే పాఠకుల సంఖ్య విస్తారంగానే వుంది. అందుకనే మధ్యతరగతి బతుకు చిత్రణని మోసుకొస్తున్న కథలకీ చదువరుల ఆదరణా, పత్రికల ప్రోత్సాహం బాగానే లభిస్తున్నాయి ఇటీవల.

చలపాక ప్రకాష్‌ మధ్యతరగతి మనిషి. కష్టజీవి. ఆ తరగతి వారి బాగోగులూ, ఇక్కట్లూ, బాగా తెలుసుకున్న అనుభవశాలి. అధ్యయన శీలమూ బాగానేవుంది. ఈ రెండు బలాలతో తనదైన రచనా విధానాన్ని ఎన్నుకున్న కథకుడు. కథావస్తువులన్నీ భావనాశ్రితాలుగా వుంటాయి. ప్రకాష్‌ కథానికల్లో, చిన్న ఆలోచనని, భావనని ఇతివృత్తంగా తీసుకుని అలవోకగా ఒక కథని చేసేస్తారు. ఈ కాలపు ధోరణుల మీదా, వ్యవస్థలోని దుర్మార్గం మీదా, మనుషుల్లోని బలహీనతల మీదా- ప్రకాష్‌ నిరసన ధ్వనిస్తుంది.

- విహారి

* * *

రచయిత బాధ్యత అతనిచుట్టూ, పాఠకుల చుట్టూ విస్తరించివున్న కష్టమయిన జీవితాన్ని గురించిన అవగాహన కలిగించమే! జీవితం నుంచి పారిపోవడం, జీవితాన్ని రంగులు పూసి చిత్రించడం ఎంతమాత్రం కాదు. ఈ విధి నిర్వహణలో మన రచయితలెందరో అద్భుత కథానిక సాహిత్యాన్ని సృష్టించి మనకు యిచ్చారు. ప్రకాశ్‌ ఈ విషయంలో తనవంతు బాధ్యతను సమర్థంగా నిర్వహించాడనే చెప్పాలి.

ఈ కథల సంపుటిలో వున్న కథలన్నీ మన చుట్టూవున్న సామాన్య జీవితాన్ని చిత్రించి, ఈనాటి సామాన్యుల జీవితంలోని సమస్యలను, కడగండ్లను, కన్నీళ్ళను, చిన్నచిన్న ఆనందాలను, ఘనీభవించిన అసంతృప్తినీ చిత్రిస్తాయి. ఒకొక్క కథ ఒకొక్క జీవిత శకలం.

- పెద్దిభొట్ల సుబ్బరామయ్య

Preview download free pdf of this Telugu book is available at Premaabhimanalu