• Prema Swaralu
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమ స్వరాలు

    Prema Swaralu

    Pages: 30
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సబ్బని కలము నుండి ' ప్రేమ స్వరాలు' ఏక వాక్య కవితలు
-------------------------------------------------------
క్లుప్తత, గాఢత కవిత్వానికి కావలసిన ప్రధాన లక్షణాలు. గాఢత అధికమవుతూ, క్లుప్తత ఎంత పెరిగితే - అంత కవి స్థాయిని ప్రతిఫలిస్తుంది. అలా "మినీ కవిత్వం" సాహిత్య ప్రక్రియలలో తన ప్రత్యేకతను చాటుకొంటూ వస్తున్నది. అందుకే "హైకూలు", " నానీలు", నానోలు, "రెక్కలు", " ఏక వాక్య కవితలు" వంటి మినీ కవితా ప్రక్రియలు అశేష ప్రజాదరణకు నోచుకొంటున్నాయి.
ప్రాచీన ఆలంకారికుడు విశ్వనాథుని - "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న నిర్వచనం స్ఫూర్తితో 1998 - 2000 సంవత్సరాల ప్రాంతంలో, తెలుగు సాహిత్యంలో తొలిసారిగా డా. ఆచార్య ఫణీంద్ర గారు "ఏక వాక్య కవితల" ను రచించి ప్రవేశ పెట్టడం జరిగింది.
ఇప్పుడు అదే వరుసలో - లబ్ధ ప్రతిష్ఠులు, అసంఖ్యాక గ్రంథాలను రవించిన కవి వరేణ్యులు శ్రీ "సబ్బని లక్ష్మీనారాయణ" గారు "ప్రేమ స్వరాలు" పేరిట తమ "ఏక వాక్య కవితల" గ్రంథాన్ని ప్రచురించడం ముదావహం.
"సబ్బని లక్ష్మీనారాయణ" కవి గారు మంచి భావుకులు. ఒక భావ కవిగా తమ ఈ "ప్రేమ స్వరాలు" అనే "ఏక వాక్య కవితల" గ్రంథంలో - ప్రేమపై అనేక "ఏక వాక్య కవితల"ను ప్రతిభావంతంగా రచించారు.
"నీ ఒక్క చూపులో వెయ్యి కృతజ్ఞతలు, వెయ్యి స్వాగతాలు"
"వసంతం మళ్ళీ వచ్చింది, నువ్వే ప్రకృతికి శోభలా -"
"పగలూ, రాత్రి నీ ధ్యాసే! పరిమళంలా నీ స్మృతి!!"
"మబ్బు తెరలు తొలగిపోయాయి - చంద్రముఖిలా నువ్వు!"
"అద్దంలోకి చూశాను - చిత్రం! నాలో నువ్వు!"
"ఎంతటి ప్రేమ నాకు నీపై - తరగని నిధిలా!"
"నీ కళ్ళు - హాయ్! రసరమ్య కావ్యాలు!"
వంటి ఏక వాక్య కవితలు అనేకం ఇందులో చోటు చేసుకొన్నాయి.
"నీ నవ్వు గుభాళించే గులాబీ పరిమళం!"
"నువ్వు కాలాన్ని నమ్ముకొన్నావు - నేను నిన్ను నమ్ముకొన్నాను!"
"చెట్టు నీడలో పచ్చటి వనదేవతలా నువ్వు!"
"అందరూ ఉన్నా, ఒంటరినే - నువ్వు లేనప్పుడు!"
"బతుకు పుస్తకంలో - అపురూపంగా నువ్వొక నెమలీకలా!"
"సప్త సముద్రాలలోని నీళ్ళు - బహుశా ప్రేమికుల కన్నీళ్ళు!"
"ప్రేమంటే - కలలు, కన్నీళ్ళు!"
వంటివి మరికొన్ని "మెచ్చు తునకలు".
"నీ మౌనంలో - ఎన్ని ప్రశ్నలు! ఎన్ని సమాధానాలు!"
"ఎదపై గాయాలు చేసుకొన్నందుకే కదా వెదురు వేణువయ్యింది"
"నీ కళ్ళలోకి సూటిగా చూశాను - రెండు భూప్రపంచాలు!"
"నువ్వు ప్రవహిస్తున్న నదివి - నది అంచులను ముద్దాడుతున్న తీరాన్ని నేను!"
"కాలం ఫోటో తీసాను - ప్రతి ఫ్రేమ్ లోనూ నువ్వే!"
"కన్నీళ్ళు, కవిత్వమే - నువ్వు నాకిచ్చింది!"
మొదలైన "ఏక వాక్య కవితలు" సబ్బని వారి తాత్త్వికతను, భావ శబలతను ప్రతిఫలిస్తాయి.
లక్ష్మీనారాయణ గారు గొప్ప ప్రేమికులు. అందుకే -
"నీ కోసం - ఒక్క నీ కోసం - కవినై ఉదయిస్తూ .." అంటూ
ఒక ప్రేమ కావ్యాన్ని ఒలకబోసారు.
ఆ ప్రేమ కావ్యమే - ఈ "ప్రేమ స్వరాలు"!

Preview download free pdf of this Telugu book is available at Prema Swaralu