-
-
ప్రేమ... ఆకర్షణ... మోహం
Prema Akarashana Moham
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 222Language: Telugu
''చూడు ముఖేష్ ఇంతవరకు జరిగింది నువ్వామ్మాయిని చూడటం ఇష్టపడటం అంతేకదా?''
''ఎస్....డాడ్...''
''చూడు నాన్నా లైఫ్‌లో ఏ విషయం గురించి తొందరపడకూడదు. అలాగే ప్రేమ విషయంలో కూడా. ప్రేమ విషయంలో త్వరగా నిర్ణయాలు తీసుకొని, తొందరపడేది మగవాళ్లు. ఎందుకో తెలుసా?''
''తెలీదు'' సిన్సియర్‌గా ఒప్పుకున్నాడు ముఖేష్.
''మొగవాళ్ల ప్రేమలో మోహం వుంటుంది. అందుకే'' తండ్రి మాటలకి ముఖేష్‌కి కోపం వచ్చింది.
''నా ప్రేమలో మోహం లేదు'' వెంటనే అన్నాడు ముఖేష్.
''ఆడవాళ్లు ఎందుకు తొందరపడరో తెలుసా?'' ముఖేష్ మాటల్ని పట్టించుకోకుండా అడిగాడు అరవిందరావు.
''తెలీదు''
''పెళ్ళి తర్వాత మాత్రమే వాళ్లు మోహంలో పడతారు కనుక'' చిన్నగా నవ్వుతూ అన్నాడు అరవిందరావు.
''సీ... మై బిలవ్డ్ డియర్. ముందు నిన్నా అమ్మాయి ప్రేమిస్తోందో లేదో తెలుసుకో. అలాగే ఎందుకు ప్రేమిస్తుందో తెలుసుకో. నాకు తెల్సినంతవరకు హ్యూమన్ రిలేషన్స్‌ని, రెండే విషయాలు శాసిస్తాయి. ఒకటి ఎకనామిక్స్, రెండు నెససిటీ- అర్థమైందా'' తండ్రికి ఎలా జవాబు చెప్పాలో అర్థం కాలేదు ముఖేష్‌కి.
''ముందా అమ్మాయి నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్'' ఉక్రోషంగా అన్నాడు ముఖేష్.
''సీయూ'' అరవిందరావు రిసీవర్ పెట్టేసాక, వాలుకుర్చీలో కూర్చుని చాలాసేపు ఆలోచించాడు ముఖేష్.
