• Pravasandhrula Ashakiranam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50.004
    100.008
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రవాసాంధ్రుల ఆశాకిరణం

    Pravasandhrula Ashakiranam

    Pages: 306
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విదేశంలో సంవత్సరాలపాటుగా స్థిరపడిన - ఒక తీరు సంస్కృతీ సభ్యతల నుంచి పెరిగిన - ఒక తరం మనుషులకు అంటే స్త్రీ పురుషులకు - తద్భిన్నమైన సభ్యత, సంస్కారం గల వేరు మనుషుల మధ్య తలెత్తే మానసిక సమస్యలు ఈ కథలకు ఇతివృత్తాలు. క్రింది తరం పిల్లలతో ఒక తరహా సంఘర్షణ అయితే, పై తరం పెద్దలతో ఆరోగ్య సంబంధమైన, బాధ్యతా సంబంధమైన సంఘర్షణ మరొక తరహా! దీనికి తోడు, మధ్య వయస్సు దాటి, అనివార్యంగా ఒంటరితనం అనుభవించవలసి వచ్చిన వారి సందిగ్ధ సంధ్యాస్థితి మరొక ప్రధాన సమస్య. వీటని కొన్ని సంవత్సరాలుగా బాగా దగ్గరగా పరిశీలించడం వల్ల పుట్టిన కథలివి.

ఈ కథల స్వభావంలో మరొక విశేషం గమనించ దగినది. దాదాపుగా అన్ని కథలూ స్త్రీ దృక్పథం నుంచి కష్టసుఖాలు విశదం చేసేవి. ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్ళిన మధ్య తరగతి స్త్రీ పురుషులు, మన సంస్కృతీ సభ్యతల పరిరక్షణ బాధ్యత ''తమదిగా భావించడ''మనే సంప్రదాయ భావుకతకు వారసులుగా నిలుస్తారు. పాత అలవాట్లు అస్థిగతంగా నిలిచిపోయి వదలవు. కొత్తజీవనంలో వెల్లువలా తాకే అలవాట్లు, ఆచారాలు, ఒకపట్టాన మింగుడు పడవు. ఇది పైకి కనిపించని ఆందోళన. అశాంతి.

శ్రీమతి శేషుశర్మ ఈ ఆందోళనలకీ, అశాంతికీ ఏది మార్గం? - పరిష్కారం ఎట్లా? అని తర్కించడం నుంచి ఈ కథలు పుట్టాయి. వీటిని ప్రకటించడానికి తగిన వాక్య నిర్మాణం, ఉద్విగ్నత, తూకం చెడకుండా కుదిరాయి. కథారచనలో సూత్రాలకు భిన్నంగా, ఈ కథల్లో తక్కువ సందర్భాల్లోనే అయినా స్వకీయ భావ ప్రకటనల కోసం ఉత్తరాల ప్రక్రియ, ఉపన్యాస ధోరణీ ఉన్నాయి. ఇవి 'సరదాగా కథ రాద్దాం' అనే వట్టి కాలక్షేపపు ఉత్సాహం నుంచి పుట్టిన కథలు కావు. చుట్టూవున్న జీవితాన్ని నిశితంగా చదివి ఆలోచనతో పొదివి పట్టుకున్న కథలు.

ఇవి, బట్టలు నలగని జీవితాలలో మనస్సులు నలిగే మనుషుల కథలు. చదువరులు ఈ కథలను ఆదరించగలరని ఆశిస్తున్నాం.

- ఇందగ్రంటి శ్రీకాంతశర్మ

Preview download free pdf of this Telugu book is available at Pravasandhrula Ashakiranam