• Prathama Chikitsa
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రథమ చికిత్స

    Prathama Chikitsa

    Publisher: Victory Publishers

    Pages: 64
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎవరైనా ఏదైనా ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళేందుకు కొంత వ్యవధి పడుతుంది. ఈ లోపున పరిస్థితి విషమించకుండా వారికి తక్షణమే ప్రథమ చికిత్స చేయడం అవసరం. చికిత్స చేసే విధానం ఎక్కువ మంది తెలుసుకొనేందుకు వీలుగా డా॥ బ్రహ్మారెడ్డిగారు ''ప్రథమ చికిత్స'' గ్రంథాన్ని రాశారు.

సామాన్యులకు సహితం సుబోధకంగా వుండే విధంగా బొమ్మలను కూడా చేకూర్చి రచించిన ''ప్రథమ చికిత్స'' గ్రంథం కూడా ఆయన ఇతర రచనల వలెనే జన విజ్ఞానానికి తోడ్పడి సామాన్య ప్రజల అభిమానాన్ని అమితంగా చూరగొనగలదని ఆశిస్తున్నాము.

- జన విజ్ఞాన వేదిక

* * *

రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యా ప్రయత్నాలూ, విషజంతువులు కుట్టటం, ఇళ్ళలో ప్రమాదాలు, కొన్ని జబ్బుల్లో ప్రమాదాలూ - ఇలాంటివే ప్రథమ చికిత్సా సమస్యలన్నీ, వీటికి తక్షణమే చేసే పనులను ''ప్రథమ చికిత్స'' అంటాం. చికిత్స కంటే ముందే జరగాల్సిన దాని పేరు ప్రథమ చికిత్స. చికిత్స (వైద్యం) కోసం జనం పట్టణాల దాకా పోయినా, ఆ లోపు రోగికి పెద్దగా నష్టం జరగకపోవచ్చు గానీ ప్రథమ చికిత్స జరగాలంటే తక్షణం జరగాల్సిందే. అలా జరగాలంటే ప్రజలందరికీ ప్రథమ చికిత్స మీద అవగాహన ఏర్పడాలి.

''ప్రథమ చికిత్స'' అనేదొక ముఖ్యమైన నైపుణ్యం. వీటిలో కొన్ని నామ మాత్ర వివరణ ద్వారా తెలుసుకోవచ్చు. మరికొన్నిటిని తెలిసిన డాక్టరు/వ్యక్తి నుంచి మాత్రమే ''కచ్చితమైన పద్ధతు'' లేంటో నేర్చుకోవాలి. అలా తెలిసీ తెలియని ప్రథమ చికిత్స చేయడం ఒక్కోసారి మేలుకంటే కీడే ఎక్కువ చేస్తుంది.

- డా॥ వి. బ్రహ్మారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Prathama Chikitsa