• Pramukha Nobel Scientistulu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రముఖ నోబెల్ సైంటిస్టులు

    Pramukha Nobel Scientistulu

    Author:

    Pages: 280
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

20వ శతాబ్దంలో సైన్సు - టెక్నాలజీ అప్రతిహతంగా పురోగమించింది. సైన్సులో ఎన్నో నూతన విభాగాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రభుత్వాలు, యూనివర్శిటీలు, లేబొరేటరీలు, సైన్సు, అభివృద్ధికి, వివిధ దేశాల సైంటిస్టులకు చేయూతనందించాయి. మూఢ నమ్మకాలు, అజ్ఞానం పారద్రోలి, విజ్ఞానం, విస్తరింపచేసి, మానవ కళ్యాణానికి విశిష్ట కృషి జరిగింది 20వ శతాబ్దంలోనే.

20వ శతాబ్దం అణుయుగంగా రూపాంతరం చెందింది. ఒక ప్రక్క అణుశక్తి మానవ కళ్యాణానికి, రోగనిరోధానికి సాధానంగా మారితే, మరో ప్రక్క అణుశక్తిని అణ్యాయుధాలుగా రూపొందించడానికి అగ్రరాజ్యాల మధ్య పోటీ ప్రారంభమయింది. ATOMS FOR PEACE, మానవ కళ్యాణానికే అణుశక్తిని వినియోగించాలని ప్రముఖ శాస్త్రజ్ఞులు కొందరు ఎలుగెత్తి చాటారు.

సైంటిస్టులు తమ సామాజిక బాధ్యతను గుర్తించాలని గట్టిగా కోరారు. యుద్ధాలలో అణ్వాయుధాలను వినియోగిస్తే మానవజాతి సర్వనాశనం అవుతుందని తీవ్రంగా సమాజిక స్పృహ కలిగిన సైంటిస్టులు హెచ్చరించారు.

రాజకీయ, సాంఘిక రంగాలలోనే కాక, శాస్త్ర, సాంకేతిక రంగాలలో కూడా మహిళలు అగ్రభాగాన వుండి, తమ విశిష్ట పరిశోధనల ద్వారా నోబెల్ బహుమతి గ్రహీతలు కావడం గర్వకారణం.

హిట్లర్ జాత్యహంకారం, యూదుల పట్ల, యితర జాతుల పట్ల ప్రదర్శించిన దౌష్ట్యం, దారుణ మారణకాండ వల్ల ఎంతోమంది సైంటిస్టులను జర్మనీలో నాజీలు తుడిచిపెట్టారు - “జాత్యాహంకారం" సైన్సు ప్రగతికి తీవ్ర నష్టం కలిగించింది. ప్రజాస్వామిక విధానాలు, సెక్యులర్ వ్యవస్థ స్వేచ్ఛాయుత వాతావరణంలో సైన్స్ ప్రగతికి ఎంతో అవసరం.

సోషల్ సైన్స్ ధృకోణం నుండి సైంటిస్టుల విశిష్టకృషిని తెలియజెప్పడానికి పుస్తకంలో ప్రయత్నం జరిగింది.

- డా. విజయం

Preview download free pdf of this Telugu book is available at Pramukha Nobel Scientistulu