• Pralayam
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రళయం

    Pralayam

    Publisher: Ramyabharathi

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగులో కథాప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి కొన్ని వేల కథలు వచ్చుంటాయి, వస్తూనే ఉన్నాయి. ఇన్ని కథలుండగా... ‘ప్రళయం' పేరుతో మేం ప్రచురిస్తున్న ఈ 3 కథలనే ఎందుకు ప్రత్యేకంగా చదవాలి అని అడగొచ్చు! కారణముంది...

మన దైనందిన జీవితాలలో తెల్లారకముందు నుండి నిశిరాత్రి అయ్యే వేళ వరకు ఎంతో అద్భుత ఆవిష్కరణలతో అబ్బుర పరిచి, ఆహ్లాదపరిచే ప్రకృతిని, ఎందరో కవులు తమ కవితా చాతుర్యంతో రకరకాలుగా అభివర్ణించారు. అంత జీవరాశితో మమేకమైన ప్రకృతి, ఒకొక్కసారి విలయతాండవం చేసి, తీవ్ర భీభత్సాన్నీ సృష్టించి, మానవజీవితాలలో తీవ్ర విషాద కల్లోలాల్ని, వినాశనాన్ని.. చేదుమాత్రలుగా మిగిల్చిన వైనాలు ఎన్నో.. ఎన్నెన్నో ఉన్నాయి. అటువంటి ప్రకృతి చేసిన భీభత్సకాండ మిగిల్చిన విషాద సమయంలో... మానవ జీవితాలలో మిగిల్చిన విషాద ఘట్టాలను, మానవ జీవితాల స్వభావాలను, ఆయా ప్రకృతి వైపరీత్య కాలాలను రికార్డు చేసి భవిషత్త్ తరాల ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ మూడు కథలు వేర్వేరు కథకులు రాసినవి. మూడూ వేర్వేరు కాలాలలో, వేర్వేరు సందర్భాలలో రాసినవి. అతి ముఖ్యంగా మూడు కథలూ ఒక 'ఉపనది, నది, సముద్రం' అనే మూడు నీటి ప్రధాన పరిసరాలలో చెలరేగిన విధ్వాంస ఘట్టాలను లిఖించిన కథలివి. పెనుతుఫానులు మిగిల్చిన విషాద ఘట్టాలలో మానవ స్వభావాలు ప్రదర్శించిన ‘మానవత్వపు గొప్ప లక్షణాలను’... అడుగంటిపోతున్న నేటి సమాజంలో మరోసారి ఎత్తి చేపించే ప్రయత్నం ఈ కథలు ఎరుక పరుస్తాయి. ప్రకృతి చేసిన విధ్వంసం కంటే మానవ జీవితాలలో చెలరేగిన సంఘర్షణల ‘ప్రళయం’ 3 విభిన్న అంశాలుతో కథలుగా మలచబడి మీకు అందివ్వబడుతున్నాయి. ప్రేమ, ఆప్యాయతలు మృగ్యమౌతూ, మానవత్వం నశించిపోతున్న దిశలో... కుటుంబ వ్యవస్థ పట్ల, మానవ జీవన విధానంలో ఎటువంటి మార్పుతో పెనవేసుకొని కట్టిపడేసే బంధాల్ని కల్పించుకోవాలో.... ఈ 3 కథలు మచ్చుకకు విశ్లేషించి చూపెడతాయి. అందుకే ఈ కథలు గుత్తిగా, నిరాశను వెదజల్లుతున్న సమాజంలో చిన్న ఆశా దీపపు ఒత్తిగా వెలిగించి... మూడు చేతులతో కాపాడుతూ మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మానవ జీవితాలలో చెలరేగుతున్న 'ప్రళయాల' నుండి... మానవత్వంతో ప్రణయాలుగా మార్చాలన్నదే మా ఈ మూడు కథల ఆశ, ఆశయం... చదవండి... చదివించండి... విచక్షణాజ్ఞానంతో ఆలోచించి... సమాజాన్ని సరైన దిశలో నడిపే ప్రయత్నం చెయ్యండి.

- చలపాక ప్రకాష్

Preview download free pdf of this Telugu book is available at Pralayam