• Plus 2 kaarEpalli kaburlu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • +2 కారేపల్లి కబుర్లు

    Plus 2 kaarEpalli kaburlu

    Author:

    Publisher: Sitaram

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కబుర్ల పుస్తకం రెండేళ్ళ క్రిందటే రావల్సింది. ప్రభుత్వ కళాశాలల్లో చదవడం నామోషీగా భావిస్తున్న ధోరణి కూడా ఒకటి కనిపిస్తోంది. గత్యంతరం లేకనే గవర్నమెంటు కాలేజీల్లో చదువుతున్నామనే భావన కూడా విద్యార్థులలో ఉంది.

సమస్తమూ కూలుతున్నప్పుడు కూల్చడంలో భాగస్వాములు కాలేని అధ్యాపకులు ఆయా కళాశాలల్లో అహరహం విద్యార్థుల కోసం శ్రమిస్తున్నారు. వారు ఎక్కడ ఏ కాలేజీలో పని చేస్తున్నప్పటికీ వారందరి పేర్లు తెలియకపోయినా స్మరించుకుంటున్నాను. అంతా విధ్వంసమే జరుగుతున్నప్పుడు మనం నిలబెట్టలేం అని నిరాశా, నిస్పృహలకు గురై అసహన పడుతున్నవారూ ఉన్నారు. అంతా అయిపోయింది. వీటిని ఇక మనం కాపాడలేం. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని వాదించే వారూ ఉన్నారు. ఇబ్బడిముబ్బడిగా కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి ప్రైవేటీకరణను ప్రోత్సాహించి, నియామకాలు చేపట్టక, వనరులు సరిగా కల్పించక ఈ కళాశాలల సహజమరణం కోసం ప్రయత్నిస్తోందనే వాదనలూ ఉన్నాయి.

బోధనా వృత్తిని బరువుగా కాక బాధ్యతగా భావించే వారికి ఇందులోని విషయాలు తమ అనుభవంలోనివిగానే అనిపిస్తాయి. వారూ అలాగే స్పందించి ఉంటారు. అనుకునీ ఉంటారు. నేను రాయాల్సినంత కటువుగా రాయలేదని నీరజ అభిప్రాయపడ్డారు. నిజమే కటుత్వాన్ని ప్రదర్శించలేకపోయాను. నాకు నైతిక ఆధిక్యత అక్కర్లేదు. ఇందులోని కబుర్లు చదివాక ఎవరిలోనైనా ఏ కొంచెమైనా ఆలోచన, ఆవేదనలు కలిగితే చాలు.

పిల్లలపై జాలి, కనికరం, దయ, జాలి కంటే కూడా వారి పట్ల గౌరవభావం ఉంటే చాలు. మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నవాళ్ళమే ఇప్పుడిలా కావడానికి ఎంతోమంది అధ్యాపకులు చెప్పిన చదువే కారణమని గ్రహిస్తే చాలు.

నాకంటూ మరి ఏ ప్రత్యేకతలూ లేవు. ఈ ఉదాత్త వృత్తిలో తడబడకుండా, తప్పటడుగులేయకుండా పనిచేసేందుకే నా ప్రయత్నం సాగింది. అయినా నా జీతం కోసం, జీవితం కోసం పని చేశాను. మిగిలినదంతా ఒక by product మాత్రమే.

- సీతారాం

Preview download free pdf of this Telugu book is available at Plus 2 kaarEpalli kaburlu