• Pillala Pempaka Vignanam Peddala Badhyata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిల్లల పెంపక విజ్ఞానం - పెద్దల బాధ్యత

    Pillala Pempaka Vignanam Peddala Badhyata

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"పిల్లల్ని నిజాయితీపరులుగా తయారు చేయడమే విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యము".

- జాన్ రస్కిన్

* * *

ప్రపంచములో ఎవరికైనా తన "సంతానమే గొప్ప పెట్టుబడి" అంటారు. కాబట్టి తమ పిల్లలను ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధతో చూచుకున్నప్పుడు మన పెట్టుబడికి సరైన విలువ, ఫలితం ఉంటుంది. స్వార్థంతో మన పెట్టుబదే కదా అని మన కోర్కెలు తీర్చుకోడానికి, డబ్బు సంపాదించడానికో ఒక ఆయుధంగా మారిస్తే, భవిష్యత్తులో ఆ ఆయుధమే కంటకంగా మారి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడమే కాకుండా, సమాజానికి కూడా పనికి రాకుండా పోతుంది.

మనిషి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటానికి బాల్యదశ చాలా కీలకమైనది. బాల్యంలో ప్రతి ఒక్కరూ మేధావి అయ్యే సామర్థ్యం కలవారే. కానీ నిజమైన పెరుగుదల యదార్థంగా వారిని పెంచే తీరుపై ఆధారపడుతుంది.

మనస్సు హృదయాంతరాళంలో సూక్ష్మమైన పొరలలో నమ్మకాలతో, తెలివైన ఆకారంలో దాగి వుంటుంది. వ్యక్తిత్వాన్ని వృద్ధి చేయడానికి సున్నితమైన పొరలలోనికి చొచ్చుకు పోవటానికి అంతే సున్నితమైన పదార్థం అవసరం. అటువంటి సున్నిత పదార్థం ప్రపంచంలో ఉన్నది 'ప్రేమ' ఒక్కటే. చాలా శక్తివంతమైనది పిల్లలలో ఆలోచనలు క్రమబద్దీకరించడానికి గొప్ప ఆయుధం. ప్రతీ జీవి అర్థం చేసుకునేది, అనుభవించగలిగేది ప్రేమే. వారికి అవసరమైనది ఇచ్చి పోషించేది ప్రేమ కాదు. ఓర్పుతో అనునయిస్తూ పిల్లల భవిష్యత్తు తీర్చి దిద్దే విధంగా చర్యలు తీసుకోవడమే నిజమైన ప్రేమ.

పిల్లల సర్వతోముఖ వికాసానికి తోడ్పడేరీతిలో, తల్లిదండ్రులు తమ ప్రేమానురాగాలను సృజనాత్మకంగా, శక్తివంతంగా ఎలా వెల్లడించాలో, పిల్లల మనోభావాలను ప్రయోజనకరమైన రీతిలో ఎలా ప్రభావితం చేయాలో, పిల్లల చదువులో, పరీక్షలలో బాగా రాణించడానికి ఎలా తోడ్పడాలో, తాము ఆశించిన రీతిలో పిల్లలను ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దాలో జీవితానుభవంతోనూ, శాస్త్రోక్తంగాను, తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా పద్ధతులను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.

మానవ పురోగమనమునకు చదువు ఒక్కటే ముఖ్యం కాదు. చదువు లేకుండా ప్రపంచస్థాయికి ఎదిగి ఎంతో మంది ఋజువు చేశారు. వ్యక్తి అభివృద్ధికి నిత్యకృషి, ఆత్మవిశ్వాసం, ధ్యేయం, దృఢసంకల్పం, మానవత్వం, ప్రేమ, దయ, సత్యం, ధర్మం తోడ్పడుతాయి. పిల్లలకు ఇటువంటి లక్షణాలు అలవడేడట్లు పెంచవలెను. ఇటువంటి వారు బాధ్యతాయుతమైన సంపూర్ణ వ్యక్తిగా ఎదిగి జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ సమాజానికి, వ్యక్తులకు, దేశానికి తోడ్పడే మంచి పౌరులుగా తయారవుతారు.

Preview download free pdf of this Telugu book is available at Pillala Pempaka Vignanam Peddala Badhyata