• Penmantalu Kokilamma Padaalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పెన్మంటలు-కోకిలమ్మ పదాలు

    Penmantalu Kokilamma Padaalu

    Author:

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు జానపద గీతాల్లో "కూనలమ్మ" పదాలకు ఒక విలక్షణ స్థానముంది. ఈ పదాల్లో ఒక్కొక్కదాంట్లో నాలుగు చిన్న చిన్న పంక్తులుంటాయి. మొదటి మూడింటికి అంత్యప్రాస నియతి వుంటుంది. నాలుగోది 'ఓ కూనలమ్మ' అనే సంబోధనతో ముచ్చటగా ముగుస్తుంది.

"ఓ కూనలమ్మా" అనే మాటకు బదులుగా 'ఓ కోకిలమ్మ' అనేది చేర్చి ఎలనాగ ఈ సంపుటికి రూపకల్పన చేశాడు. ఉక్తి వైచిత్రి, ఛలోక్తి గుణం, ఎత్తిపొడుపు లేక మేలుకొలుపు ఈ కోకిలమ్మ పదాలలో ఉన్నాయి. ఒక పదం చదవగానే పాఠకుడు చిరునవ్వు చిలకరించడమో, పగలబడి నవ్వడమో చేస్తాడు.

ఈ పుస్తకంలో కోకిలమ్మ పదాలతో పాటు "పెన్మంటలు" అనేవీ వున్నాయి. ఈ పేరులోనూ శబ్ద చమత్కారాన్ని జోడించాడు ఈ రచయిత. ఇక్కడ 'పెన్' అంటే 'పెను'. 'పెన్' అంటే 'కలం'. ఈ పదాలన్నిటిలోనూ హాస్య ఫణితి, శబ్ద చమత్కృతి ప్రధానంగా భాసిస్తాయి.

- డా. సి. నారాయణ రెడ్డి

* * *

ఎలనాగ గారి ఈ పుస్తకం కవితా హాస్యాలకు వినోదాలకు చెందినది. నవ్వుటకు, నవ్వించుటకు, ఆ రోజుల్లోనైనా, ఈ రోజుల్లోనైనా కవి వ్రాయదలచుకుంటే నవ్వదగినవి, నవ్వించదగినవి చాలా ఉంటాయి. కళ్ళు చూడగలగాలి, చెవులు వినగలగాలి, మేధా హృదయాలు స్పందించగలగాలి.

ఎలనాగ గారికి మంచి సృష్టికి పనికొచ్చే మంచి దృష్టి వుంది. జీవితంలోని చమత్కారాలను పట్టుకొని, చమత్కారంగా చెప్పగలిగే దృష్టి. ఈ పుస్తకంలో కవితలు సమకాలిక జీవితాలకు, వ్యవస్థలకు, పరిపాలనకు పట్టే అద్దాలు. వీటికి ఆయువుపట్టు భావాలే కాక తుదిపద విన్యాసాలు, చెవులకు గిలిగింతలు పెట్టే యత్రిప్రాసలు. ఎలనాగ గారి భావంతో 'జిగి' ఉంటుంది. లోతు ఉంటుంది.

- డా. వెల్చాల కొండలరావు

Preview download free pdf of this Telugu book is available at Penmantalu Kokilamma Padaalu