• Pellillu Swargamlone Jarugutai
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 76
    95
    20% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయి

    Pellillu Swargamlone Jarugutai

    Pages: 238
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాహుల్‌ ఏదో బుక్‌ చదువుతూ పుకున్నాడు రాత్రి తొమ్మిదింటికి.

ఇంతలో ఫోన్‌ మోగింది.

రిసీవర్‌ తీసి ''రాహుల్‌ హియర్‌'' అన్నాడతను.

''నువ్వేనని నాకు తెలుసబ్బాయీ!'' నవ్వుతూ వినిపించింది అపరిచితురాలి స్వరం.

''ఇప్పుడెందుకు చేశావ్‌?'' కాస్త విసుగు అతని కంఠంలో.

''ఏం... ఇంకేమ్మాయి అయినా చేస్తానందా?''

''ఏంటీ?''

''ఫోన్‌.''

''లేదు... ఖచ్చితంగా లేదు'' విసురుగా అన్నాడు రాహుల్‌.

''ఛ... ఛ ఏం తెలీదు మొద్దబ్బాయికి'' కాస్త కవ్వింపుగా అందామె.

''ఏం తెలీదు... ఏం తెలీదు కూడా! మహాతల్లీ... నువ్వెవరో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోమ్మా'' చిరాగ్గా అన్నాడు రాహుల్‌.

''ఏం... ఏమ్మా! నువ్వు అంత విసుగ్గా అడుగుతుంటే నేను ఎందుకు చెప్పాలి?'' టీజింగ్‌గా అడిగిందామె.

''ఫోన్‌చేసి నా పన్లు పాడుచేస్తున్నది నువ్వే కనుక.'' ఒళ్ళుమండి అన్నాడతను.

''ఎందుకోయ్‌! అంత కోపం!... ఒక్కసారి కోపం తగ్గించుకుని అలా బయటకి చూడు, నీ గది కిటికీ నుంచి... అందమైన శరత్కాలపు రాత్రి... వింత అందాలతో మెరుస్తోంది. రమణీయమైన ప్రకృతి, ఆనందాల ఆకృతి దాల్చానని గర్వంతో విర్రవీగుతోంది.... ఈ చలికాలం చిరుచిరు అలజడులతుఫాను రేపుతోంది గుండెల్లో. ఒంటరిగా వున్నవారికి కాలరాత్రులే అవుతున్నాయ్‌. జంటగా వున్నవారికి జౌవలి మెరుపులు అందిస్తున్నాయి. ఇత అందమైన రాత్రిలో... ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలోనూ అలా వేడెక్కిపోతావేంటమ్మా కోపంతో!'' మెత్తని తేనె ప్రవాహంలా సాగుతోంది ఆమె వాక్‌ ప్రవాహం.

Preview download free pdf of this Telugu book is available at Pellillu Swargamlone Jarugutai