• Patakulu Naku Rasina Uttaralu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాఠకులు నాకు రాసిన ఉత్తరాలు

    Patakulu Naku Rasina Uttaralu

    Author:

    Pages: 184
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాఠకులు నాకు ఉత్తరాలు రాయడం, నేను ''పల్లెటూరు'' కధ రాసినప్పటి నించీ ప్రారంభమైంది. అప్పుడు నాకు 18వ సంవత్సరం వుండొచ్చు. అంతకు ముందు కూడ 2, 3 చిన్న కధలు రాశాను. కానీ, ''పల్లెటూరు'' కొంచెం పెద్దది. ''ప్రేమ లేకుండా పెళ్ళి వుండకూడదు'' అని చెప్పిన కధ అది. పాఠకులకు అది చాలా నచ్చింది.

నాకు మార్క్సిజం పరిచయం అయ్యాక 'విషవృక్షమే' మొదటి రచన. తర్వాత, 'కాపిటల్‌ పరిచయాలు' 5 భాగాలు అయ్యే వరకూ అదే పని సాగింది. పాఠకుల ఉత్తరాలు వస్తూనే వున్నాయి, నా జవాబులు వెళ్తూనే వున్నాయి.

అసలు నేను, పాఠకుల గురించి ఏ మనుకుంటానంటే, పుస్తకాలు తరుచుగా పునర్ముద్రణలు అవుతున్నాయంటే, పాఠకులు వాటిని కొంటున్నారని అర్ధమే. కొంటున్నారు సరే, చదువుతున్నారా? నాలుగు పేజీలు ఇటూ అటూ తిప్పి పడేస్తున్నారా? చదివితే అర్ధమవుతున్నాయా? అర్ధమైతే, సంతోషిస్తున్నారా? ఒక పుస్తకం చదవక ముందు కన్నా, చదివిన తర్వాత వాళ్ళకి తమలో గాని, బైట గాని, ఏమైనా మార్పు కనపుతోందా? - ఇటువంటి ప్రశ్నలే వుంటాయి నాకు.

పాఠకులకు నా పుస్తకాలు అర్ధమవుతున్నాయా? నచ్చుతున్నాయా? చదువుతున్నారా? చదివే విషయాలతో ఏకీభవిస్తున్నారా? నా రాతల వల్ల ఏదైనా ఉపయోగం వుందా? వాటి వల్ల వారి ఆలోచనల్లో మార్పు జరిగిందా? - అనే నా సందేహాలకు జవాబులు ఉన్నాయి ఈ ఉత్తరాల్లో! నాకు ఈ పుస్తకం పని సంతోషంగా అయింది.

రచయితలు ఇలా చేస్తే, పాఠకుల స్పందనలు ఇతర పాఠకులకు తెలుస్తాయి.

- రంగనాయకమ్మ, 01-12-2015.

Preview download free pdf of this Telugu book is available at Patakulu Naku Rasina Uttaralu