• Paschatya Nataka Pramukhulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాశ్చాత్య నాటక ప్రముఖులు

    Paschatya Nataka Pramukhulu

    Publisher: Natali Prachuranalu

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేను ''పాశ్చాత్య నాటక కర్తలు'' పుస్తకం వ్రాసినప్పుడు వారి కనుగొన్న శైలీ విధానములు తెలుసుకొని, ఆసక్తితో ''నాటక శైలి'' రాశాను, అప్పుడు అనేక శైలులలో పనిచేసిన ప్రయోక్తల గురించి తెలుసుకొంటుంటే, ఆసక్తితో వారి గురించి ఈ ''పాశ్చాత్య నాటక ప్రముఖులు'' వ్రాశాను. నాకు ప్రయోగాలంటే ఇష్టం! వారి ప్రయోగాలు ఆశక్తిగా చదివి తెలుసుకొనేవాణ్ణి! ఈ విషయాలు మన తెలుగు పాఠకులకు అందివ్వాలనే కోరికతో ఇవి రాశాను. ప్రపంచ నాటకరంగాన్ని పరిచయం చేయడమే వీటి ప్రథాన లక్ష్యం!

స్టానిస్ల విస్కీ నాటక ప్రదర్శనలలో ప్రకృతిని రంగస్థలంపై ''స్వాభావికతా వాదం'' లో దర్శింపజేశాడు. నాటక అంతరార్థాన్ని బహిర్గతం చేస్తూ నూతన ప్రయోగ విధానం రూపొందించాడు. మెయర్‌హోల్డ్‌ ''ప్రతీకవాదం'' తో అస్వభావసిద్ధ కళారూపాలలో నాటకాలను కనుగొని కొత్తగా నాటకాలు ప్రదర్శించాడు. స్టానిస్ల విస్కీ యొక్క అంతర్గత వాస్తవికతను, మెయర్‌హోల్డ్‌ యొక్క బాహ్యనాటకీయతతో కలిపి ప్రయోగించి ''నాటకీయ వాస్తవికత'' గా నూతన శైలిగా తీర్చిదిద్దాడు వఖటాన్‌గోవ్‌ . వాస్తవిక వాద నాటకరంగం నుంచి విడిపోయి గ్రోటోవ్‌స్కీ తన నాటకాల్లో సీనరీ, దీపనం, మేకప్‌, దుస్తులు, మరియు సంగీతం మొ॥ హంగులు ఏమీ ఉండ కుండా చేసి, ''పూర్‌ థియేటర్‌'' ను సృష్టించాడు. జెస్‌నర్‌ నటులలో మార్పు వచ్చే భావస్థితికి అనుగుణంగా దీపనమును వెలుగు-నీడలు ప్రసారంచేస్తూ అభివ్యక్తం చేసి, వాస్తవికతను రంగస్థలం మీద ప్రదర్శించకుండా, దృశ్యం యొక్క భావస్థితి పైనే దృష్టి కేంద్రీకరించి, ''అభివ్యక్తివాదం''లో నాటకములు ప్రదర్శించాడు. స్టేజి నిర్మాణమంతా ఒక లెక్చరర్‌ రూములో ఛాయా చిత్రాలతో మ్యాజిక్‌ లాంట్రెన్‌, స్లైడ్‌ ప్రొజెక్టర్లు పెద్దపెద్ద స్పీకర్లుతో నిండివుండి, కొత్త రూపంలో ''ఎపిక్‌'' విధానం లో పిస్కేటొర్‌ నాటకాలను ప్రదర్శించేవాడు.

ఈ పుస్తకం రాస్తూ ప్రపంచ నాటకరంగంలో వచ్చిన మార్పులు తెలుసుకుంటుంటే చాలా ఆనందించాను. ముఖ్యంగా ఒక విషయం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. నేను తెలుగు నాటకరంగంలోనే తొలి ప్రయోగాలు చేశానని ఆనందించేవాడిని. కాని కిట్టనివాళ్లు ఇలాంటి నాటకాలేంటి? ఇవి నాటకాలు ఎలా అవుతాయి? మీ నాటకాలు అసలు ఇతరులు ఎవరైనా ప్రదర్శిస్తారా? ఇంకా అనేక మాటలతో నిరుత్సాహపరిచేవారు. జీవితంలో సత్యమైనవి, వాస్తవమైనవి అయిన చర్యలు కానివి మనం 'నాటకాలు' అంటున్నప్పుడు, రంగస్థలం మీద ప్రదర్శన కోసం వ్రాసేవి నాటకాలు ఎందుకు కాదు? మూస నాటకాలకే అలవాటు పడిన మన తెలుగు వాళ్లకి ప్రయోగాలు గురించి, విశ్వనాటకరంగం గురించి తెలియక అజ్ఞానంలో ఉన్నందున, తెలివి తక్కువగా మాట్లాడటం సహజమే! వాటికి / వారికి సమాధానమే ఈ పుస్తకం! అగస్ట్‌ స్ట్రిన్‌బెర్గ్‌ (The Stronger (1889) - with only one speaking part) రాశాడంటే నేను ఆశ్చర్యపోయాను. దీన్ని 2013 లో ''బలవంతురాలు'' గా అనువాదం చేశాను. నేను ఏక పాత్ర నాటిక ''ఏకోనారాయణ'' 1986 లో వ్రాసినప్పుడు ఏకపాత్ర భాషణ నాటిక, దృశ్యంలో నటుడు లేని నాటిక, ఒక పాత్ర మరో పాత్రను కలవని స్వీయనటనా నాటిక, మొ॥ వాటి గురించి పథకం వేశాను. ప్రోత్సాహం లేక వ్రాసి, ప్రచురించ లేదు. ''యూనియన్‌ లీడర్‌'' అనేక పాత్రలున్నా ఒకే పాత్ర ప్రసంగిస్తుంది. 2012 లో ప్రచురించాను. అగస్ట్‌ స్ట్రిన్‌బెర్గ్‌ కి 120 సం॥లు తర్వాత నా నాటిక వెలుగు చూసింది!

ఈ పుస్తకంలో ప్రస్తావించిన ప్రయోక్తలకు, నాకు సహకరించిన వ్యక్తులకు నా కృతజ్ఞతలు.

- కొత్తపల్లి బంగార రాజు

Preview download free pdf of this Telugu book is available at Paschatya Nataka Pramukhulu