• Parishkaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పరిష్కారం

    Parishkaram

    Pages: 118
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి రచించిన కథల సంకలనం ఇది.

* * *

పురుషులందు పుణ్యపురుషులు వేరంటారు. కథల్లోనూ అట్లాగే మంచి కథలు వేరు. ఈ సంపుటి లోనివి ఇతరుల అభిప్రాయాలతో అగత్యం లేని కథలు. స్వయంగా ప్రకాశించే వాటికి పరిచయాలు అవసరమా?

'సందులు ఇరుకైతే పరవాలెదు. మనసులు ఇరుకైతె ఎలా? ' అని ప్రశ్నించే కథ 'ఇరుకు సందు'; ఆధునిక స్త్రీవాదం ఒక పురాతన గాథ ద్వరా తళుక్కున మెరిసిపోయే విలక్షణ వ్యాఖ్యానం 'సాధ్వి'; పల్లెటూరి రచ్చబండపైన కొనసాగే పోసుగోలు కబుర్ల నుంచి బయటపడే జాతి బలహీనత 'గురవిందగింజ'; 'ఔరా' అంటూ అబ్బురపరిచే 'పరిష్కారం' ; 'సమతూకం సామరస్యం అనేవి ఎప్పటికైనా సాధ్యమా? అది లేనప్పుడు అడివికి సమాజానికి ఏమైనా భేదమా?' అని హెచ్చరించే రచన 'తులామానం'; 'ఒక సామాజిక రుగ్మతను అడుగంటా నిర్మూలించడం సాధ్యమా?' అంటూ విస్మయం ప్రకటించే ఉదంతం 'చెదలుపట్టిన రాయి'; రాయిలాంటి మనసుల్లో కూడా తేమ ఉంటుందని నిరూపించిన సంఘటన 'ఔదార్యం'; లభించిన సుఖజీవితంలో నుంచే అంతులేని హక్కుల కోసం జరిగే పోరాటాన్ని చూచి ఒక భూమి తల్లి బిడ్డ చెందిన ఆవేదన 'గమ్యం'; సమకాలీన పరిణామాలతో రాజీపడలేని పాతకాలపు ఆదర్శాలకు చోటెక్కడో చూపించిన 'రెక్కమాను'; ఇలా ఒక ప్రాంతపు జాగ్రఫి, హిస్టరీ, సోషియాలజీ, ఎకనామిక్స్ - వెరసి ఒక సామాజిక జీవన స్వరూపం ఈ కథల సంపుటం.

మాటలని మంత్రాలుగా ప్రయోగించడం ఈ కథకునికి తెలుసు. ఒకే ఒక్క వాక్యంతో వ్యక్తిత్వాన్ని రూపుకట్టించడం తెలుసు. నిశిత పరిశీలన, నిరంతర విశ్లేషణ, భావ వ్యక్తీకరణలోని వ్యంగ్య వైభవం, వెలితి కానరాని శిల్పపరిణతి, లోకకల్యాణాన్ని ఆకాంక్షించే ఆంతర్యం - ఈ కథలకు పంచప్రాణాలు.

- మధురాంతకం రాజారాం

Preview download free pdf of this Telugu book is available at Parishkaram