• Palapitta Pata - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పాలపిట్ట పాట (free)

    Palapitta Pata - free

    Author:

    Publisher: Kavya Sadan

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవిత్వానికి కావలసింది భావావేశం. తాత్త్విక సృజనాత్మక నైపుణ్యం. వాస్తవ ప్రతీకల మధ్య, సమాసాల మధ్య, పదబంధాల మధ్య, ఆలంకారిక అనుప్రాసల మధ్య, బలమైన ఊహల మధ్య, పోలికల మధ్య, పదాల మధ్య, పాదాల మధ్య, పరిపూర్ణతను సాధించే రసాత్మక లయల మధ్య కవి కవిత్వాన్ని వ్యక్తీకరిస్తాడో కవిత్వమే ఎన్నుకున్న వస్తువులో దృశ్యమానమవుతుందో తెలియదుగానీ రాసేప్పుడు కవికీ కవిత్వానికి తెలిసినంత అభివ్యక్తి రహస్యం మరొకరికి తెలియదు. ఎవరి అభివ్యక్తి రహస్యం వారికే తెలుస్తుంది. అలాగే సుంకర రమేశ్ కవిత్వం. సుంకర పరిణతి చెందిన కవి. ఏ కవితావస్తువును ఏవిధంగా వ్యక్తపరచాలో ఆయనకు బాగా తెలుసు. ‘పాలపిట్ట పాట' కవితా సంపుటం చదవండి. తీరిక చేసుకుని చదవండి. నెమ్మదిగా చదవండి. మనసుపెట్టి చదవండి.

- డా. నాళేశ్వరం శంకరం

అన్ని రుతువుల్లో రాటుదేలిన కవితలమాలిక. రెండు దశాబ్దాల్లోనే పాతబడే కవితలు కావివి. ఇప్పటికీ, ఎప్పటికీ కణకణలాడే హృదయ కణికలు, ప్రతి సమకాలీన ఘటనకు స్పందించే గుణం రమేశ్‌ది. ఆల్‌ఫరాన్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన ఘటన గురించైనా, రువాండా మారణ హోమానికి ప్రతిస్పందించినా, దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి ఆంతమైనప్పుడైనా రమేశ్ కవిత రాయకుండా ఉండలేడు. నిరంతర అధ్యయనశీలి. ప్రాంతీయ సంఘటనలా, అంతర్జాతీయ సంగతులా తేడా లేదు. దీనిని బట్టి గ్రహించవచ్చు కవితారచనలో అతని ప్రాపంచిక దృక్పథమేమిటో.

- ఎన్. గోపి