• Palapitta Kathalu
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాలపిట్ట కథలు

    Palapitta Kathalu

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సంతలో ఒక బాలుడు కంబళ్ళను అమ్మకానికి పెట్టాడు. అవి బాగా ఖరీదైనవి. అందరూ చూసి వెళుతున్నారే గాని కొనడంలేదు. ఇంతలో ఒక వ్యక్తి వాటి దగ్గరకు వచ్చి వాటిని పరిశీలించాడు. ఆ కంబళ్ళు కచ్చితంగా తన స్నేహితుడు నేసిన కంబళ్ళేనని నిర్ధారణకొచ్చాడు అతను. కాని ఆ స్నేహితుడు అక్కడ లేడు. మరి ఆ కంబళ్ళు బాలుడి చేతిలోకి ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే ‘రత్న కంబళి’ కథ చదవాల్సిందే.

ఓ మిఠాయి దుకాణంలో మిఠాయిలు మాయమవుతుంటాయి. దానికి కారణం అక్కడి నౌకర్లలో ఒకరు! అతను మిఠాయిలను దొంగతనం చేయడు. కానీ, సమయం చూసి నోట్లో వేసుకుంటాడు. ఆ దొంగను పట్టుకునేందుకు యజమాని కుమారుడు ఎలాంటి పథకం వేశాడో తెలిస్తే మనం ముక్కున వేలేసుకుంటాము.

కుండీల్లో విత్తనాల్లోంచి మొలకలు వచ్చిన మరుక్షణమే పిచ్చుకలు వచ్చి తినేస్తుంటాయి. తన చిట్టి బుర్రతో పిచ్చుకలు వచ్చినా మొలకలు వైపుకు వెళ్లకుండా ఒక అబ్బాయి ఎలాంటి ఉపాయాన్ని అనుసరించాడో తెలుసుకుంటే, అతని పద్ధతి మనం కూడా అనుసరిస్తాం.

ఒక వ్యాపారి చాదస్తపు అలవాట్లు గల మిత్రునితో ప్రయాణిస్తూ బావిలో పడ్డాడు. చాదస్తపు మిత్రుడు అతణ్ణి రక్షించాడా? లేదా? ఏం జరుగుతుందనేది కథ చివరిదాకా ఉత్కంఠగా సాగుతుంది. ఈ కథ చదివాక మన మిత్రుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారేమోనని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం.

వర్షం రాత్రి అడవిలో రాకుమారునికి ఆశ్రయమిచ్చాడు ఒక పెద్దమనిషి. రాకుమారుడు వారి ఆతిథ్యానికి ముగ్ధుడయ్యాడు. ఆ పెద్దమనిషి కుమార్తె పట్ల రాకుమారుడు తన ఇష్టాన్ని ప్రకటించాడు. అయితే ఆ అమ్మాయిని తన సేనానికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇంతకీ రాకుమారుడు చేసిన పని సమంజసమేనా?

ఇలా ఈ పాలపిట్ట కథాసంపుటిలోని అన్ని కథల్లో ఊహించని మలుపులు, ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Palapitta Kathalu