• Padava America Telugu Sahiti Sadassu 2 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు - 2 (free)

    Padava America Telugu Sahiti Sadassu 2 - free

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కేవలం తెలుగు సాహిత్యానికి మాత్రమే పెద్ద పీట వేస్తూ, ఉత్తర అమెరికాలో సృజనాత్మక రచనలనీ, రచయితల్నీ ప్రోత్సహించే సదుద్దేశ్యంతో 1994 లో సంస్థాపించబడిన లాభాపేక్ష లేని సాహిత్య, ధార్మిక సంస్థ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా. 2005 లో హైదరాబాద్‌లో అదే పేరిట అనుబంధ సంస్థని నెలకొల్పి అనేక సాహిత్య, ధార్మిక కార్యక్రమాలు ఇండియాకి కూడా విస్తరించబడ్డాయి.

ఉత్తర అమెరికాలో ఉన్న తెలుగు భాష, సాహిత్యాభిమానులనీ, ముఖ్యంగా రచయితలు తమదే అయిన ఒక వేదిక మీద కలుసుకుని సాటి సాహితీ వేత్తలతో వ్యక్తిగత పరిచయాలు పెంపొందించుకుని తమ రచనలని ఇతరులతో సభా ముఖంగా పంచుకుని ఒక సాహిత్య వాతావరణాన్ని సృష్టించుకుంటే బావుంటుంది అనే చిన్న ఆలోచన 1998 లో అమెరికా తెలుగు సాహితీ సదస్సు పేరిట రూపు దిద్దుకొని అప్పటి నుంచి అమెరికాలో అనేక నగరాలలో రెండేళ్ళ కొకసారి నిర్వహించబడుతోంది. ప్రతీ సదస్సుకీ అమెరికా, భారత దేశం, తదితర దేశాల నుంచి లబ్ది ప్రతిష్టులైన సాహితీవేత్తలు కొందరిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడం, కొందరిని జీవన సాఫల్య పురస్కారాలతో గౌరవించడం సాంప్రదాయంగా మారింది.

- వంగూరి చిట్టెన్ రాజు

గమనిక: " 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు - 2" ఈబుక్ సైజు 9.9mb