• Okinta Vekuva Kosam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒకింత వేకువ కోసం

    Okinta Vekuva Kosam

    Publisher: Balaji Granthamala

    Pages: 148
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

“ఏదో చెబుతానన్నావని, పని మానుకొని వచ్చాను. నావేపు చూడడం తప్ప, పెదవన్నా కదపవు. ఏం చెప్పాలిట?” అన్నదామె.

అతను పలక లేదు.

“అయితే వెళ్ళనామరి?” అన్నదామె లేవబోతూ.

“దూరంగా ఉన్నప్పుడు ఏవేవో చెబుదామనుకొంటాను. అలాగా అనుకుంటూనే నీ ముందుకొస్తాను. ఒక్క మాట పెగలదు. నీ పెదవులమీద నవ్వుల పరిమళాలు పుష్పిస్తాయి. ఇక నా మాటలన్నీ మూగవయిపోతాయి. ఆ పరిమళాల్లో నేను మునిగిపోతాను!” అన్నాడతను.

“అయితే ఆ మాటలన్నీ వొచ్చే జన్మలదాకా దాచి ఉంచు కన్నా. అప్పుడు చెప్పుకొందాం!” అన్నదామె.

“నీతో చెప్పవలసినవి నా దగ్గర చాలా ఉన్నాయే మరి” అన్నాడతను.

“అంటే- చాలా జన్మలదాకా మన ఇల్లాగే కలుసుకోవచ్చునన్నమాట!” అన్నదామె నవ్వుతూ.

సహృదయులను, కరుణాంతరంగులను, సౌజన్యమూర్తులను చూసినప్పుడు, ఈశ్వరభావం నా నిండా నిండిపోతుంది. క్రౌర్యాన్ని, అమానుషత్వాన్ని, రక్తపాతాన్ని, దారిద్ర్యాన్ని చూసినప్పుడు- ఈశ్వరునిమీద కూడా తిరగబడదామనిపిస్తుంది.

- (8-1-90- సోమవారం)

తొలిసారిగా ఆమె చిరునవ్వును చూసినప్పుడు, అసూయపడ్డాను ఆ నవ్వును సొంతం చేసుకొనబోయే అదృష్టవంతుణ్ని తలుచుకొని. తరువాత నన్నుచూసి నేనే అసూయపడవలసి వచ్చింది...

“ఈ వేళప్పుడు పడుకొన్నావేమిటి?” అన్నాదామె.

“నిద్రపోదామని!” అన్నాడతను.

“ఇప్పుడేం నిద్ర?” అన్నదామె కళ్ళు చికిలింది.

“కలగందామని!” అన్నాడతను.

“దేన్నిగురించి?” అన్నదామె ఆశ్చర్యంగా.

“నీగురించి” అందామనుకొని, అనలేక, ఆమెనోసారి నిలువునా చూసి, తల తిప్పుకొన్నాడతను. ఆమె గళ స్పర్శతో, మామూలు మాట కూడా మల్లెమొగ్గలా పరిమళిస్తుంది...

- (11-1-90-గురువారం)

Preview download free pdf of this Telugu book is available at Okinta Vekuva Kosam
Comment(s) ...

If i have to highlight the lines i liked in this book then the whole book will be in the radium yellow color. felt i should have bought the ebook instead of renting. Amazingly aesthetically woven lines on the life and relationships. Brings to the originality of the essence of living life pure. My deep respects for the author for bringing this kind of thoughts as book.