• Okati Rendu Mudu Anantam
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒకటి, రెండు, మూడు ... అనంతం

    Okati Rendu Mudu Anantam

    Pages: 115
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అంకెలతోను, సంఖ్యలతోను ఆడుకోవడమే ఈ పుస్తకం ముఖ్యోద్దేశం. సంఖ్యా జ్ఞానం, సంఖ్యా గణితం నలుగురికీ అందుబాటులోకి తీసుకురావాలని చేసిన ప్రయత్నం ఇది. భాష మీద ఏ కొద్దిపాటి ఆసక్తి ఉన్నా ఈ పుస్తకం మీకు నచ్చవచ్చు. గణితంతో ఏ కొద్దిపాటి పరిచయం ఉన్నా, లేకపోయినా ఈ పుస్తకంలోని విషయం మీకు అందుబాటులో ఉంటుందనే నా నమ్మకం. స్థాలీపులాక న్యాయంలా ఏవో నాలుగు మెతుకులు చిదిమి చూపిస్తాను. ఈ పుస్తకం చదివిన తరువాత గణితం మీద కొంతైనా కుతూహలం పుడుతుందనే నా ఆశ.

అంకెలతోను, సంఖ్యలతోను ఆడుకోవడమంటే? అంకెలు, సంఖ్యలు మన జీవితాలలోకి, మన సంస్కృతిలోకి, మన భాషలోకి ఎలా జొరబడ్డాయో పరిశీలించడమే నా గమ్యం. మరీ పాఠ్య పుస్తకంలా కాకుండా కేవలం కబుర్లు చెప్పుకుంటున్నట్లు మొదలు పెట్టి, క్రమేపి ఈ భావాలు, చాప కింద నీరులా, గణితంలోకి ఎలా ప్రవేశించేయో చెబుతాను. గణితంలో కుతూహలం ఉండి నేర్చుకోవాలనే సద్యోజాత ఆసక్తి ఉన్నవారు నేను అమర్చిన క్రమంలో చదివితే మార్గం సుగమం అవుతుంది.

మొదటి పదకొండు అధ్యాయాలలోను ఒకొక్క అంకెకి కానీ సంఖ్యకి కానీ భాషాపరంగా ఉన్న ప్రత్యేక స్థానాన్ని చర్చించేను. తరువాత నాలుగు అధ్యాయాలలోను పెద్ద పెద్ద సంఖ్యల అవసరం చూస్తారు. తరువాత అయిదు అధ్యాయాలలోను గణిత సంబంధమైన అంశాలు, అనంతాలు అందరికి అందుబాటులోఉండే స్థాయిలో కనబడతాయి. చివరి మూడు అధ్యాయాలలోను గణితంతో చెలగాటాలు కనిపిస్తాయి.

- వేమూరి వేంకటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Okati Rendu Mudu Anantam