• Oka Success Kosam
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక సక్సెస్ కోసం

    Oka Success Kosam

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే... సబ్బు కావాలి. చిత్రంగా లేదూ? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చిపడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఒ మలుపుగా భావించాలి. ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్న పిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలై పోవాలన్నారు.

తాళంతో పాటే తాళం చెవికూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు. తూటా కంటే శక్తివంతమైనది మాట! ఒక్కమాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెర లాగ కాదు. సూది పని ఎప్పుడూ జోడించడమే, కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే. అందరిని కలుపుకుంటూ బ్రతకాలి. కత్తెరలాగా విడదీస్తూ కాదు...

నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యల్లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని... స్నేహితుడిని నీ దుఃఖ సమయంలోనూ, యోధుడిని యుద్ధంలోనూ, భార్యను పేదరికంలోనూ, గొప్ప వ్యక్తిని అతని వినయంలోనూ పరీక్షించాలి. చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. ఎదుటివారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు.

కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే, గెలిచినవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తుంటాడు. అదే తేడా... గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన. ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. నేను గెలవటంలో ఓడిపోవచ్చు. కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను... ప్రయత్నిస్తూ గెలుస్తాను... గెలిచి తీరుతాను. స్వయంకృషితో పైకొచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ, అహంకారం ఉండదు.

Preview download free pdf of this Telugu book is available at Oka Success Kosam