• Oka Schezophrenic Kalalu Gnapakalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఒక స్కిజోఫ్రీనిక్ కలలు, జ్ఞాపకాలు (free)

    Oka Schezophrenic Kalalu Gnapakalu - free

    Pages: 52
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవుడు ఆలోచనాపరుడు. నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. ఊపిరి తీసుకొనడం మాని ఎక్కువసేపు ఎలా ఉండలేడో, అలాగే మెలకువగా ఉన్నప్పుడు ఆలోచించకుండా నిశ్చలంగా ఎక్కువసేపు ఉండలేడు. నిద్రలో కూడా ఈ ఆలోచనలు కొనసాగుతాయి. అంటే నిద్రలో కూడా తనకొచ్చే ఆలోచనలే ఈ కలలు. కలలు ఎవరి ఆలోచనా సరళిని బట్టి వారికి వస్తాయి. ఒక్కోసారి మన చేతనావస్థలో మన మెదడు గ్రహించలేని విషయాల్ని కూడా అంతచ్ఛేతనావస్థలో మెదడు విశ్లేషించి మనకు కలల రూపంలో సందేశమిస్తుంది.

ఈ చిన్న పుస్తకంలో నేను వ్రాసే కలలు, జ్ఞాపకాలు అన్ని నేను కన్న కలలే. ఇంకా నా నిజ జీవితంలోని జ్ఞాపకాలు అన్నీ యథార్థాలే. నేనేవి ఊహించి వ్రాయలేదు. నేనిచ్చిన కలల విశ్లేషణ కూడా నా అంతకు నేను సహేతుకదృష్టితో విశ్లేషించినవే. ఎవరి కలలు వారే విశ్లేషించుకుంటే వారికి సరియైన సమాధానం లభించవచ్చు. అయితే ఎలా విశ్లేషించుకోవాలో తెలిసికొనడం ఆవశ్యకం. ఈ పుస్తకం అలా విశ్లేషించుకోవడానికి ఇంకా కలల గురించి శాస్త్రీయ అవగాహన కలిగి ఉండేదానికి ఉపయోగపడవచ్చు.

కలల గురించి మానవుడు ఆనాదిగా ఆలోచిస్తూనే ఉన్నాడు. కాని సరియైన కలల నిఘంటువు తయారుచేసికొన లేకున్నాడు. చాలా కాలం క్రితమే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలైన ఇవాన్ పావ్‌లోవ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, సి.జె. జెంగ్ సుసన్ కల్లర్, కలలను ఎలా శాస్త్రీయంగా విశ్లేషించాలో తెలిపి యున్నారు. పైన పేర్కొన్న శాస్త్రవేత్తలు ఈ కలల విశ్లేషణకు ఇంకా మనో వైజ్ఞానిక శాస్రానికి మూల పురుషులు అని భావించవచ్చు. వీరి పేర్లు ఇక్కడ పేర్కొనడం సమంజసమే అయినా, నాకు వీరి గురించి తెలిసింది చాలా తక్కువ. నేను ఇంతవరకు వీరి రచనలేవి చదువలేదు. కేవలం కొంతవరకు వీరి విశ్లేషణ గురించి పరిచయముంది.

కాని ఈ పుస్తకం వారు రాసిన విశ్లేషణకు భిన్నంగా ఉండవచ్చు. ఎందుకంటే, నేనొక స్కిజోఫ్రీనిక్ వ్యాధిగ్రస్తుణ్ణి. స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్టులకు వారి ఆలోచనలలాగానే, వారి కలలు కూడా నమ్మశక్యం కాకుండా, అద్భుతంగా ఉంటాయి. కనుకనే ఈ పుస్తకం కొంత భిన్నమైంది.

ఈ పుస్తకం వ్రాసేదానికి స్పందన, నేను ఇటీవల కన్న కలలే. నేను వీటిని గ్రంథస్తం చేయకుంటే ఇవి నాతోనేపోతాయి. అలా నాతోనే పోకూడదన్న ప్రయత్నమే ఈ రచన.

- టి. మల్లా రెడ్డి

Comment(s) ...

Quite interesting, informative and helpful to the affected persons. A lot more thanks for bringing it to the public.
Neelakanta Reddy kadapa AP, India

I have come across "Odi Gelichina Manishi" and "schizophrenic - Dreams, Memories " books in Telugu while I was searching for books on psychic diseases in connection with schezophrenic disease of one of my near relation.These books are of immense "scientific value" as they contain clean information based on rationality, holistic understanding of humans which would help psychiatrists, scientists,councellors and common citizens in contributing towards improved treatment of scezophrenia.The author has shown great courage in honestly writing his experiences.Only a person with the interest of society at heart can undertake such writing.This made me an admirer of the author. I strongly feel reading of these books more than one time will enable the immediate family members to understand the pain being suffered by the patient and help him/her in conquering scezophrenia by cooperating in a better way with the patient. I wish the author a happy and successful life in future as well.