• Oka Sarala Nirvachanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక సరళ నిర్వచనం

    Oka Sarala Nirvachanam

    Pages: 103
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిఖార్సైన అత్యల్ప ఉష్ణోగ్రత (అబ్సల్యూట్ జీరో) అది...!!
ధృవాలనే ఆశ్చర్యపరిచే టండ్రాతి టండ్రాల స్థితి...!!
అత్యంత లోపరహిత అసాధారణ స్థితి...!!

గది నుండి విడివడి
నిదానంగా అక్కడకు పోతే
చేయి మొదలు కాలి వేళ్ళ వరకు
శరీరం నిలువెల్లా
కొంకర్లు పోతూ
ఒక్కసారిగా
రాతి పుల్లగా మారిపోయే ఘన-ఘనీభవనం

అక్కడ
పదార్ధాలన్నీ
లోపాల్ని వదులుకుంటూ పోయి
సర్వసంగ పరిత్యాగులౌతాయట!
పరమాణువుకీ పరమాణువుకీ
మధ్య ఎడం పూర్తిగా పోయి
తల్లినంటి పెట్టుకొని పడుకున్న కుక్కపిల్లలౌతాయట

పరమాణు-కంపనాలు కూడా ఉడిగిపోయి
చుట్టూ పరిభ్రమించే ఋణావేశ కణాలు మాత్రమే
ఒక దాని నుండి మరొకదానికి
ఆవేశ ప్రవాహాలను
అందించుకుంటాయట!

గది ఉష్ణోగ్రతలో
చిక్కడానికే మొరాయించే
తుంటరి వాయు-ఉదజని,
అక్కడికంటూ పోయాక
పదహారణాల విద్యుత్ వాహక
ఘనాతి ఘన పదార్ధమౌతుందట!

రాగిని మించిన
ఋణావేశ ప్రవాహాలతో
జివ్వుమనిపించగలనంటుదట!

Preview download free pdf of this Telugu book is available at Oka Sarala Nirvachanam