-
-
ఒక ఆత్మకథ
Oka Atma Katha
Author: Pothuri Vijayalakshmi
Publisher: Sri Rishika Publications
Pages: 82Language: Telugu
నవ్య వారపత్రిక నిర్వహించిన పోటీలలో మూడో బహుమతి పొందిన నవల "ఒక ఆత్మకథ".
* * *
ఒకరోజు సాయంత్రం ఏడైంది. కరెంటు పోయింది. లోపల వేడి. బాబు తిక్కగా ఏడుస్తున్నాడు. ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాను. మసక వెన్నెల. చల్లనిగాలి. “జో అచ్యుతానంద జోజో ముకుందా!” అప్రయత్నంగా నా నోటివెంట వచ్చేసింది. వాడిని గుండెలకు హత్తుకుని పచార్లు చేస్తూ పాడుతుంటే ఏడుపు ఆపేశాడు. బయటవున్న సిమెంటు బెంచీమీద కూర్చుని వూపుతుంటే నిద్రపోయాడు. బల్వీ వచ్చి నాకు కాస్త దూరంలో కూర్చొన్నాడు. పాట ఆపగానే హఠాత్తుగా వంగి నా కాళ్ళు ముట్టుకున్నాడు. అదిరి పడ్డాను.
ఏమిటిది అంటే ”భాభీ మా! నాకు మా అమ్మ గుర్తొస్తోంది. మీరివ్వాళ ఈ పాట పాడుతూ వుంటే పైలోకంలో వున్న మా అమ్మ నా బిడ్డను ఆశీర్వదిస్తోందనిపిస్తోంది అంటూ కళ్ళు తుచుడుకున్నాడు. నాకూ మనసు కరిగిపోయింది. సంతోషం వచ్చినా, బాధ కలిగినా మొట్టమొదట గుర్తు వచ్చేది అమ్మేగా మరి!
