• O Stree Atmakatha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఓ స్త్రీ ‘ఆత్మ’కథ

    O Stree Atmakatha

    Author:

    Pages: 256
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రచయితగా పి.ఎస్‌.నారాయణగారికి మూడు ముఖ్యమైన లక్షణాలున్నాయి. మొదటిది ఆయన స్త్రీ పక్షపాతి. పరకాయ ప్రవేశంలాగా ఆ పాత్రలలోకి ప్రవేశించి, అన్నీ స్వయంగా అనుభవించి చెపుతున్నంత నమ్మకంగా వారు కథనం సాగించగల్గటంలోని కిటుకు ఇదే. రెండవది-ధర్మపక్షపాతి, అంటే సమాజానికి అహితకరమైన రచనలు ఆయన చేయరు. వివాహేతర సంబంధాలను నిరసించటము, మాదక ద్రవ్యాల బారినుండి పిల్లలను రక్షించుకోవాలనుకోవటమూ, సంపద పెంచుకోగోరినా, అక్రమ సంపాదనలకు ఆరాటపడకూడదని హెచ్చరించటమూ ఈ విషయాన్ని సూచిస్తాయి. మూడవది - మానసిక విశ్లేషణ ప్రధానాంశంగా కథాకథనం సాగిస్తారు. ఈ శక్తి పుష్కలంగా ఉన్న కారణంగానే వీరి కథల్లో, నవలల్లో సంభాషణలు రక్తి కడతాయి. పాత్రలు సజీవ రూపాలుగా దర్శనమిస్తాయి. ఎక్కడా అసంబద్ధమైన వర్ణనలుగాని, మలుపులుగాని, ఆకాశ విహారాలుగానీ ఉండవు.

ఈ నవలలోని కథాంశము, అందులో చోటుచేసుకున్న ఘటనలు, అవి చొరబడిన తీరు, మలుపుతిరిగిన తీరు, పరిష్కృతమైన తీరు - లేదా నవలలోని పాత్రలు సమాధానపడిన తీరు - ఎంత అద్భుతంగా ఉన్నవంటే - పైన పేర్కొనిన మూడు లక్షణాలు - స్త్రీ పక్షపాతి, ధర్మపక్షపాతి, మానసిక విశ్లేషణలో నిపుణులు - అయిన వ్యక్తి మాత్రమే ఇలా వ్రాయగలడు.

చదివిన వారి కాలము, ధనము సద్వినియోగ మయ్యాయన్న సంతృప్తి తప్పక లభిస్తుందని మనవిచేస్తూ సెలవు తీసుకొంటాను.

- డా॥ వడ్డి విజయసారథి

Preview download free pdf of this Telugu book is available at O Stree Atmakatha