• Nisacharudu 2
  • Ebook Hide Help
    ₹ 99
    110
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిశాచరుడు - 2

    Nisacharudu 2

    Author:

    Pages: 254
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నురగలు కక్కుతున్న అశ్వాన్ని అదిలించటం ఆపి, నెమ్మదిగా నడిపించబోతూ ఉన్నట్లుండి ఉలిక్కిపడింది ప్రభావతి.

“ఏమయింది తల్లీ... వాహనానికి ఏదైనా దెబ్బ తగిలిందా?” వెంటనే అడిగాడు వెనుకగా వస్తున్న వదరుడు.

"శంభుడు... మనతోపాటుగా రావటంలేదు. గమనించావా?” వెనక్కి చూపిస్తూ అన్నది ఆమె.

తను కూడా ఉలిక్కిపడ్డాడు వదరుడు. “ప్రాణాలు దక్కించుకోవటానికి పారిపోయి రావటంలో తప్పు జరిగిపోయింది తల్లీ. మన క్షేమాన్నే చూసుకున్నాము. ఆ అమాయకుడిని గురించి మర్చిపోయాము” బాధ నిండిన కంఠంతో అన్నాడు.

“ప్రాణాలతో ఉండి ఉంటాడా?” అడిగింది ప్రభావతి.

“చెప్పటం కష్టం తల్లీ. ఈ మైదానంలో కనిపించే అనాగరికులు మహా క్రూరులు. కోపాలు వస్తే తమవారి తలల్ని తామే నరికిపడేసే దుర్మార్గులు” అన్నాడు వదరుడు.

“ఆగండి....” అంటూ తన వారందరినీ ఆగిపొమ్మని సైగ చేయబోయింది మహారాణి.

“వద్దు తల్లీ! ఇప్పటికే చాలామందిని పోగొట్టుకున్నాము. ఇప్పుడు గనుక ఎవరినైనా వెనక్కి పంపితే, ఖచ్చితంగా మాయమైపోతారు. ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో తిరిగి మనకి కనిపించరు.” ఆమెను వెంటనే వారించాడు వదరుడు.

“మరీ శంభుడు?” అడిగింది ఆమె.

“భగవంతుడి మీద భారం వేయటం తప్ప ఇప్పటి పరిస్థితిలో మనం చేయగలిగింది ఏమీలేదు తల్లీ” అన్నాడు అతను.

తల విదిలించింది మహారాణి.

“బాధపడకండి తల్లీ... సూర్యుడు అస్తమించే సమయానికి మనం వంకరమడుగు దగ్గరికి చేరుకుంటాం. మన మంత్రవాదిని పిలిచి అంజనం వేయించి చూద్దాము. తప్పకుండా ఏదో ఒక విషయం తెలిసిపోతుంది” అంటూ ఆమెను ఊరడించే ప్రయత్నం చేశాడు వదరుడు.

తల ఊపి తన మనసులోని అధైర్యాన్ని అణచివేసుకునే ప్రయత్నం చేస్తూ, అశ్వాన్ని తిరిగి వేగంగా పరుగులు తీయించింది ప్రభావతి.

Preview download free pdf of this Telugu book is available at Nisacharudu 2