• Nene Ee Kshanam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • నేనే ఈ క్షణం (free)

    Nene Ee Kshanam - free

    Author:

    Pages: 102
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


నిద్రలో పాప పెదాలమీద
ఒక నవ్వు సీతాకోకలా
రెక్కలు విప్పి ఎగిరిపోయింది.

*****


ఆమె ఉన్న ప్రపంచం కదా ఇది.
ఈ ప్రపంచాన్ని మరింత ప్రేమించాలి.
నా ప్రేమ అలలై పరుగులెత్తి
అజ్ఞాత తీరాన ఉన్న ఆమెని తాకాలి.

*****


కలనించి మేలుకొన్నట్టు
మెలకువనించీ మేలుకోవాలనిపిస్తుంది.
ఇంత జీవించే రొదలోనూ,
ఏదో నిశ్శబ్దం వెంటాడుతుంది.

*****


ప్రపంచాన్ని నేనూ,
నన్న ప్రపంచమూ
ఎప్పటికైనా తాకగలమా?!
ఎప్పటికైనా నేను,
నా శరీరాన్నైనా తాకగలమా?!

*****


నేను, నేనుగా వుండటం కన్నా
నువ్వుగా వుండటంలోనే ప్రశాంతత కలుగుతోంది నాకు.
బహుశా, నేను, నేనుగా వుండటం
నా ఊహ అయి వుంటుంది.
నువ్వుగా వుండటం వాస్తవం అయి వుంటుంది.

*****


నీలో నువు ఊహించినట్టే, కలగన్నట్టే
ఏదో ఆద్యంతాలు లేని ప్రేమ
తనలో నిన్నూ ఊహిస్తూ వుంది. కలగంటూ వుంది.