• Nemalikalu Puse Kalam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నెమలీకలు పూసే కాలం

    Nemalikalu Puse Kalam

    Author:

    Publisher: Mukta Publications

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అనుక్షణం జీవితంలోని వ్యర్థతత్త్వాన్ని మోహపు చేతుల్తో నెట్టేస్తూ, పువ్వుల్నీ లేలేత చివుళ్ళనీ, నిర్మలమైన పసినవ్వుల్నీ, నునువెచ్చటి ఉదయకాంతుల్ని, చెట్లసందుల్లోంచి జాలువారుతూ నిశ్శబ్దంగా ప్రవహించే వెన్నెల కాంతుల్నీ, అసలుసిసలు కల్తీలేని ప్రేమల్ని ప్రేమించే వాళ్లకోసం, ఈ నెమలీకల స్పర్శలా ఉండే కవితాక్షరాలు. ఎప్పటికీ మానని కర్కశమైన గాయాలూ, చీకటీ, చేదూ, కత్తుల దారుల్లో నడిచొచ్చిన పాదాలూ, వీటన్నిటి మీద రాసే పూసే మంత్రపు మల్హా ములీ కవితలు.

మనం సౌందర్యవంతంగా మృదుల మనోహరమైన ఓ ఆలోచనై నప్పుడు... అప్పుడు మనల్నెవరైనా ఆలోచిస్తే... వాళ్ళకెంత ఓదార్పూ... ఒకానొక ఉక్కిరి బిక్కిరి తనంలోంచే పెనగులాడి బయల్వెడలిన క్షణాన ఓ మలయ పవసం, ఓ కొండపూవు పరిమళం ఎంతటి హాయినిస్తాయి... ఇంతటి... చల్లటి గాలి వీవెనకు చెమట ఆరిన ఉపశమనంలాగా...

జీవితాన్ని బేహాద్గా ప్రేమించాలి, కామించాలి, ఎడారుల్లో పచ్చని అడవుల్ని, బీటలు వారిన చెరువుల్లో నీటిపూటల్నీ చూడాలి, దర్శింపజేయాలి.

అదే పద్మ కవిత్వం చేయబూనిన కార్యం.

- కాశీభట్ల వేణుగోపాల్

Preview download free pdf of this Telugu book is available at Nemalikalu Puse Kalam