• Neelo Konnisarlu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • నీలో కొన్నిసార్లు (free)

    Neelo Konnisarlu - free

    Author:

    Pages: 152
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నీలో కొన్నిసార్లు

నీలో కొన్నిసార్లు ఉత్సవముంటుంది


అప్పుడు నీకందర్నీ పలకరించాలనిపిస్తుంది

పూలతో, పిట్టలతో, దారినపోయే మనుషులతో తోచిన మాటలన్నీ మాట్లాడాలనిపిస్తుంది

దుఃఖించే నేత్రాలపై మృదువుగా ముద్దులు పెట్టాలనిపిస్తుంది

ఎవరేమనుకొంటే ఏమిటని వచ్చీరాని పాటలన్నీ పాడాలనిపిస్తుంది

దేహాన్నొక కెరటం చేసి నర్తించాలనీ,

నలుగురు పిల్లల్ని ప్రోగుచేసి పరుగుపందెంలో వాళ్ళతో ఓడిపోవాలనీ అనిపిస్తుంది


నీలో కొన్నిసార్లు నిరాశ వుంటుంది


అప్పుడు ప్రకాశిస్తున్న ఎండలోకి ఎవరో చీకటిని ఒంపుతున్నట్లుంటుంది

కనిపించని తలుపులన్నీ మూసుకొంటూ లోలోపలికి వెళ్ళిపోవాలనిపిస్తుంది

గండశిలవంటి కాలాన్ని పగులగొట్టి దిగంతాలకి విసిరేయాలనిపిస్తుంది

తెలియని ఉప్పెన ఏదో నలువైపులా నుండీ ముంచేస్తున్నట్లుంటుంది

విసుగువేరు తొలుచుకొంటూ వెళ్ళి నిన్ను పూర్తిగా ఖాళీ చేసుకోవాలనిపిస్తుంది


కొన్నిసార్లు నీలో కోరికల సమూహాలుంటాయి


నీ ఇంద్రియాలు వికసించి లోకాన్నొక దాహకమై కమ్మేయాలనిపిస్తుంది

చూసినవన్నీ కోరక ముందే స్వంతం అయిపోవాలనిపిస్తుంది

ప్రపంచం నీ ముందు మోకరిల్లి నిన్ను కీర్తించాలనిపిస్తుంది

మృత్యువుకే నిన్ను చూస్తే భయం వేయాలనిపిస్తుంది