• Neelaveni
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నీలవేణి

    Neelaveni

    Author:

    Pages: 133
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పి.వి. సునీల్ కుమార్ ఒక ప్రమాదకర రచయిత. అవును. ఆ మాటకొస్తే ప్రమాదకరమైన పాత్రల్ని ప్రవేశపెట్టటంతోనే యీ కథా సంపుటి మొదలవుతుంది. శీర్షికని బట్టి నీలవేణి కోసం ఎదురు చూసే పాఠకుడికి ‘దెయ్యం’ ఎదురై దిమ్మెరపోతాడు. అయితే అది మనసు చక్కని దెయ్యం గనుక ముచ్చటపడతాడు. ఒక అమానుష పాత్ర అమాంతం మన ముందుకు వచ్చి, నీడలుగా మారిన మానవసంబంధాల డొల్లతనం బయటపెడుతుంది. ఎన్నో ఆటుపోట్ల నడుమ ‘నీలవేణి’ మనిషిగా నిలబడటం ఎట్లాగో తెలియజేస్తుంది. ఇక ‘అందం’, ‘నాన్న హైదరాబాదొచ్చాడు’ కథల్లో మానవతా సౌందర్యం ఆవిష్కరించబడింది.

ఏమైనా కాకున్న పి.వి. సునీల్ కుమార్ మామూలు రచయిత కాడనిపిస్తుంది. అతను దెయ్యాల చేత మానవ సంబంధాల్ని వ్యాఖ్యానింపజేసి ఉపరితల భక్తి పరుల్ని అవహేళన చేస్తాడు. వ్యాపార రచయితల్ని, వ్యాపార సినిమాల్ని, మీడియా ప్రచారాల్ని తప్పు పడతాడు. కులాధిపత్యాల, మతాధిపత్యాల అసలు రంగు బయటపెడతాడు. లోలోపల లొసుగులు వెల్లడి చేసే పోలీసు వ్యవస్థని, న్యాయ వ్యవస్థని సైతం తూర్పారబడతాడు. మొత్తం మీద ఉనికిలోని స్థిరీకృత సామాజిక ప్రమాదకర భావజాలానికి ప్రమాదకారిగా తయారయ్యాడు!

నిజానికి ఇటువంటి ‘ప్రమాదకర’ రచయితలే నేటి సాహిత్యానికి ప్రాణావసరం.

- డా. పాపినేని శివశంకర్

Preview download free pdf of this Telugu book is available at Neelaveni