• Nayanaanjali
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నయనాంజలి

    Nayanaanjali

    Pages: 222
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"మీ ఇంట్లో దొంగలు పడ్డారు. ఏభైవేల రూపాయల సొమ్ములు పోయాయి కదూ తల్లీ!" ప్రశాంత కంఠంలోని ఆ తియ్యదనానికి ఎదుటివారు పరవశించక మానరు.

అవును" అన్నట్లు తలూపింది అత్రి.

"నలుగురు దొంగలొచ్చారు. మీ యింటికి తూర్పుదిశగా ఓ అరమైలు వెళ్ళి ఒక సందులో ఆగి వారు ఆ నగల్ని పంచుకుని తలో దిక్కు వెళ్ళిపోయారు.

అత్రి, మానస శిలాప్రతిమలయ్యారు. అమ్మ మళ్ళీ మాట్లాడసాగారు.

"మీ ఇంట్లో పనిచేసే నౌఖరు సహకారంతో ముగ్గురు దొంగలు బయట నుంచి వచ్చి ఈ పని చేశారు. ఆ సొమ్ములన్నీ ఆకారాలు కోల్పోయి ఛిన్నాభిన్నమైపోయాయి. దొరకటం కష్టం."

అత్రి నోరు విప్పి ఏదో మాట్లాడబోయింది.

ఆ ప్రయత్నాన్ని కొనసాగనీయకుండా అమ్మ వెంటనే మానసని చూస్తూ అన్నారు-
"మీ తల్లికి చాలా సుస్తీగా ఉంది కదా, త్వరలో కోలుకుంటారు. ఆ తర్వాత నా దర్శనానికి వస్తారు."

మానస ఏ భావం లేని రాతిబొమ్మైంది.

అమ్మ యథావిధిగా వారి నుదుట విభూతి దిద్దారు. పూజా సామగ్రిలోంచి పళ్ళుతీసి ఇద్దరికీ ఇచ్చి వీరి సజ్జను ప్రక్కనున్న చపటాలోకి వంచి కాళీ సజ్జను తిరిగి ఇచ్చేశారు.

అది తీసుకుని బయటకు వచ్చేశారు ఇద్దరూ. అక్కడ నుంచి సూటిగా వెళ్ళి ఎడంవైపు ఒంపులో ఆగి చుట్టూ చూశారు. జనసంచారం లేని ప్రదేశంలా ఉంది. కాస్త దూరాన కంపించిన ఓ బొగడ చెట్టుకింద కూర్చున్నారు.