• Natakam Telugu Bhasha Sahityam Patrika Rachana
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాటకం - తెలుగు భాష, సాహిత్యం, పత్రికా రచన

    Natakam Telugu Bhasha Sahityam Patrika Rachana

    Publisher: Natali Prachuranalu

    Pages: 32
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

‘నాటకము’ జనులందరినీ ఆకర్షించే ఉత్తమ సాహిత్య ప్రక్రియ, అందువల్ల “కావ్యేషు నాటకం రమ్యమ్” అని అన్నారు. కావ్యాలలో నాటకం కమనీయమైనదనీ, రమింప దగినదనీ ఈ వాక్యం అర్థం.
నాటక రచన మీద లక్షణ గ్రంథం సంస్కృతంలో వ్రాయబడిన ‘నాట్యశాస్త్రం’ మాత్రమే ఆదిలో తెలుగు నాటక రచనకు కూడా ఆధారమైంది. రూపక – రచనా ప్రదర్శనములకు సంబంధించిన అన్ని విషయాలు ఇందులో రచించబడ్డాయి.
సాహిత్య పరంగాను, ప్రదర్శన పరంగాను పాశ్చాత్య నాటక ప్రభావం – తెలుగు నాటక రంగంపై ఉంది, తర్వాత మమైకమైపోయింది. మహాకవి శ్రీ గురజాడ వెంకట అప్పారావు “కన్యాశుల్కం”; శ్రీ వేదం వేంకట రాయ శాస్త్రి “ప్రతాపరుద్రీయం” మొII నాటకాల మీద పాశ్చాత్య నాటక ప్రభావం ఉందని తెలుసు. ‘ఆంధ్రనాటక పితామహుడు’ శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు, ‘ఆంధ్రచారిత్రక నాటక పితామహుడు’ శ్రీ కోలాచలం శ్రీనివాసరావు నాటకాల మీద పాశ్చాత్య రచనల ప్రభావంవుండటం సత్యదూరంకాదు. పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలోని రచనా శిల్పంలో, ఇతివృత్తాలలో, పాత్రల స్వభావచిత్రణలో పాశ్చాత్య నాటకప్రభావం ఉండటం గమనించగలం.
పత్రికల్లో సినీమాలు మీద, టీ.వీ. కార్యక్రమాల మీద వచ్చే రివ్యూలకన్నా నాటక విమర్శలు ప్రచురించడం తక్కువ. అందువల్ల కూడా నాటకాలను విశ్లేషించడం తెలుసుకోలేకపోతున్నారు. ఏవో కొన్ని వచ్చినా, అవి ఎంతవరకూ నాటక రంగానికి మేలు చేస్తున్నాయి? అన్నది ప్రశ్నార్థకమే!
పత్రికల్లో నాటక విమర్శలు రాకపోవడానికి ప్రధాన కారణం – పత్రికా విలేఖరులు నాటకరంగ విద్యలో నిరక్షరాస్యులు కావడమే! నాటకవిద్యకు అనేక శాస్త్రాల అధ్యయనం అవసరం ఉంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

- కొత్తపల్లి బంగార రాజు

Preview download free pdf of this Telugu book is available at Natakam Telugu Bhasha Sahityam Patrika Rachana