• Nata Sekharulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నట శేఖరులు

    Nata Sekharulu

    Publisher: Natali Prachuranalu

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవిత చరిత్రలు మనల్ని తీర్చిదిద్దగల మార్గ నిర్దేశకాలు. మన ముందు నడిచినవారి వెలుగు జాడలు. మనలోని అలసత్వాన్ని, నిర్లిప్తతను నిరోధించి ఉత్సాహంతో ముందుకు నడిపించగల దివ్యౌవషదాలు. యుక్తవయసులో జీవిత చరిత్రల ప్రభావము ఎంతైనావుంటుంది. మానవులలో మహనీయులందరూ చిన్ననాట చదివిన లేదా విన్న జీవిత చరిత్రల ప్రభావంతో ఒక వ్యక్తినిగాని, ఒక వ్యాపకంగాని ఆదర్శంగా తీసుకొని నిరంతర కృషితో పైపైకి ఎదిగి ప్రపంచచరిత్రలో ప్రసిద్ధికెక్కిన వారే. కొందరయితే తమని ప్రభావితంచేసిన జీవితాలస్పూర్తితో ఆటంకాలను అవమానాలను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని మహోన్నతులై మానవ చరిత్ర ప్రగతినే మార్చగలిగేరు.

ఏదైనా విషయం వ్రాయడం అంతతేలికైన పని కాదు. మన మనసులో వున్నది ప్రతీది మాటలలో పెట్టలేం. మాటలాడిన ప్రతీవిషయం వ్రాతలోకి మార్చలేం. ఆలోచనకు, మాటకు, వ్రాతకు వ్యక్తిత్వం పరిపక్వత వలన కొంత, సామాజిక ఆవశ్యకతవలన కొంత నియంత్రణ అవసరం. అందుచేత స్వీయ జీవిత చరిత్రలయినా, ఆదర్శప్రాయులైన ఇతరుల జీవిత సంగ్రహాలయినా వ్రాయదల్చుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆ రచనలలో కొంత అపరిపక్వత తప్పదు. ఉపయుక్త సమాచారం వరకే పరిమితమయిన జీవిత చరిత్రల సంకలనాలు (డైరెక్టరీలు) ఆచూకీగ్రంథాలుగా (రిఫరెన్సు పుస్తకాలుగా) సమాచార అన్వేషకులకు ఎంతగానో ఉపయోగపడ గలవు. 'ఆదర్శమూర్తులు' శీర్షికన నటశేఖరుల సమాచారం ఒకచోట చేర్చి ప్రచురిస్తున్న ఈ పుస్తకం ఆ విధంగా చాలా ఉపయోగ పడగలదని నా విశ్వాసం.

నాటకరంగ వైభవ ప్రకాశానికి శ్రీరాజుగారు చేస్తున్న బహుముఖ కృషిలో 'ఆదర్శమూర్తులు' పేరిట పెక్కు జీవిత సంగ్రహాలను ప్రచురింపతలపెట్టడం ఒక ప్రత్యేకత. ఈ జీవిత సంగ్రహాలు సంక్షిప్త సుందరంగా ఆయా నటుల జీవితాలలో ముఖ్య సంఘటనలకే పరిమితమై సమాచార రూపంలో మాత్రమే ప్రచురితమయినవి. రచన క్లుప్తంగా వుండడం వలన ఆయన వ్యక్తుల గురించి తగినంత తెలుసుకోగలిగేదిగా ఆసక్తిదాయకంగా గ్రంథం కొనసాగినది.

ఈ పుస్తకం చదువరులను ఆకట్టుకొని తొలి నుండి తుది వరకు చదివించేట్టుగావుంది. నాటకరంగంలోని వ్యక్తుల గురించి క్లుప్తంగా తెలుసుకోగల గ్రంథంగా వ్యక్తులకు, గ్రంథాలయాలకు, నట, నాటక శిక్షణాలయాలకు ఎంతగానో ఉపయోగపడగలదు. అంతేకాదు సమర్ధులైన నాటక రంగ పరిశోధకులకు మంచి ఆధారగ్రంథం కూడా కాగలదు.

- గణపతిరాజు నరసింహరాజు

Preview download free pdf of this Telugu book is available at Nata Sekharulu