• Narudu Nakshatralu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నరుడు - నక్షత్రాలు

    Narudu Nakshatralu

    Pages: 233
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

నరుడు - నక్షత్రాలు

ఈ కొండలేమిటి, నదులేమిటి, నక్షత్రాలేమిటి ఈ చరాచర సృష్టీ అంతా ఏమిటి. మనమేమిటి, అనే విచారం లేక కనుపించే మేడలు, మిద్దెలూ, అసెంబ్లీలూ, అధికారాలు, దర్పాలూ, డాంబికాలూ, అంతవరకే చూస్తూ జీవించే జీవితం క్షుద్రమయింది. అందులో ప్రశంసించతగినదేమీ లేదు. అట్లాంటివాడు మానవుడనే బిరుదొకటి తగలించుకుని తిరగటంలో అర్ధంలేదు. వారికి యిండ్లుకాదు, కోష్ఠాలు సముచిత స్థానాలు. పంచభక్ష్యాలు కాదు, పచ్చి గడ్డి సముచితాహారం. అట్లాంటివారిని జీవనభృతి కోసం ఆశ్రయించవలసిన వచ్చిందనీ, సేవించవలసి వచ్చిందనీ విచారిస్తుంటాను.

అధికార రోగపూరిత బధిరాంధక శవాలూ ధనైక లోభులూ, అసూయా, ద్వేషమూ, మొదలైన దుష్టజాడ్య పీడితులూ యిత్యాది నికృష్టజాతులకు ఆకాశపఠనం అసమాన ఔషధంగా పనిచేస్తుంది. నక్షత్రావలోకనం, నవజీవనాన్ని ప్రసాదిస్తుంది. ఉదయం నుంచీ సాయంకాలం వరకూ, ప్రాపంచిక కోలాహలంలో బురద పూసుకుని యింటికివచ్చి నిర్మలాకాశం క్రింద పడుకుని పాలబాటలో కాస్సేపు పచారుచేస్తే, ఆకాశ గ్రంథాన్ని కాస్సేపు అధ్యయనం చేస్తే, బయట పూసుకుని వచ్చిన జంబాలపటలం వదలిపోయి నిర్మల మనస్కుడవుతాడు, ఈ అనంత విశ్వంలో తన స్థానాన్ని గుర్తించడంతో, ఏది అల్పం, ఏది అనల్పం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది తుచ్ఛం, ఏది స్వచ్ఛం అనే సత్యదృష్టి అవతరిస్తుంది. జీవితంలో దేనికి విలువనివ్వాలి అనే విచక్షణా, దేన్ని ప్రతిఘటించాలి అనే ధైర్యమూ ఆవిర్భవిస్తాయి. ఇట్లా విశ్వ సూత్రాలను విదితం చేసుకోవడంతో మన దృక్పథమూ, మన జీవితమూ, మన సర్వస్వమూ మారిపోయి, దేశమూ, జాతి అనే క్షుద్రబంధాల నుంచీ భూగోళం సూర్యగోళం యిత్యాది విశ్వబంధాలనుంచీ బయటపటమే కాకుండ మనం ఇంద్రియ పరిమితమై బాధా బంధురమైన శారీరక పంజరం నుంచే ఒకానొక ఆత్మవిముక్తిలాంటి అనుభవాన్ని పొంది కేవలం జ్ఞానజ్యోతిగా మాత్రమే ప్రకాశిస్తాము. రోజూ పడుకోబోయేముందు ఒక గంటసేపయినా ఆకాశగ్రంథాన్ని అధ్యయనం చెయ్యాలి.

- గుంటూరు శేషేంద్ర శర్మ

* * *

In his 1840 feature entited "The Hero as Poet" Thomas Carlyle defines a poet’s role gloriously. Carlyle maintains that the poet-prophet speaks to the noble, the pure, the type of all times and places.

Seshendra Sharma, the rebel poet of Andhra Pradesh, is an example of such an Indian poet prophets, the "Spirits fierie", who drive the dead thoughts over the universe like withered leaves and quicken the birth of a new, better tomorrow.

Seshendra Sharma, born in 1927, is a coastal Andhra Product. A highly educated and conscious poet with a marked academic and bureaucratic profile. But it is not his visibility in seminar circuits and academic circles that has endeared him to the Andhrites.

To Andhrites and to those other Indians who have read him in translation Seshendra Sharma is the revolutionary poet-prophet. His poetry celebrates the clarion-call of resistance...

- The New Indian Express, March 12, 1999

Preview download free pdf of this Telugu book is available at Narudu Nakshatralu
Comment(s) ...

Seshendra Visionary
poet of the millennium

http://seshendrasharma.weebly.com

October 20th,1927 - May 30th ,2007

Parents: G.Subrahmanyam (Father) , Ammayamma (Mother)

Siblings: Anasuya,Devasena (Sisters),Rajasekharam(Younger brother)

Wife: Mrs.Janaki Sharma

Children: Vasundhara , Revathi (Daughters),Vanamaali , Saatyaki (Sons)

-Seshendra Sharma better known as Seshendra is a colossus of Modern Indian poetry.
- His literature is a unique blend of the best of poetry and poetics.
- This site presents essence of the millennium in a powerful poetic style.