-
-
నరుడు
Narudu
Author: Madhubabu
Publisher: Madhu Priya Publications
Pages: 540Language: Telugu
''నువ్వు అనవసరమైన భయాలను మనసులో పెట్టుకోకు. చీకటిపడేలోపు మనం నగరానికి దగ్గరిగా పోవాలి. దారిలో కనిపించే ప్రతి గ్రామాన్ని హెచ్చరిస్తూ ప్రయాణం చేయాలి'' తన వాహనాన్ని ఇంకోసారి అదిలిస్తూ తన నిర్ణయాన్ని తెలియచేసింది మహారాణి.
తాను ఎంతచెప్పినా ఆమె ఆలకించదని అర్ధమై మౌనంగా వుండిపోయింది చెలికత్తె.
ఆఘమేఘాల మీద పరుగుతీయటం మొదలుపెట్టాయి వారి వాహనాలు. దట్టమైన దుమ్ముతెరలు గాలిలోకి లేవసాగాయి. గదాధరుడి కోసం ఎదురుచూస్తూ, ఒక బండరాయిని ఆనుకుని కూర్చున్న శ్యామలుడికి కనిపించినాయి ఆ దుమ్ముతెరలు. గుడారాల దగ్గిర వున్న సైనికులకు కూడా అగుపించాయి.
''మన నగరంవైపు నుంచి రెండు అశ్వాలు అతివేగంగా వస్తున్నాయి ప్రభూ... బహుశా సేనాపతి ఏదైనా వర్తమానం పంపించి వుంటారు'' బండరాయి మీదినుంచి లేచి తన గుడారంలోకి పోబోతున్న దళపతి దగ్గిరికి వచ్చి విన్నవించాడు ఒక సైనికుడు.
ఇది నరుడు నవల రెండు భాగాలు కలిపిన సంపుటం.
Pls Enable Rent option for this book.
Please enable rent option for eBook.
Is rent option available?
seems all madhubabu gari books are out of stock. I'm looking for some books for a long time