• Naruda Emi Nee Korika
 • Ebook Hide Help
  ₹ 60
  70
  14.29% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నరుడా... ఏమి నీ కోరిక?

  Naruda Emi Nee Korika

  Author:

  Pages: 73
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

మనం నవ్వును మర్చిపోయి ఎంతకాలమైంది?కొన్నేళ్లు పోయేక నవ్వు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పుస్తకాలూ లేదా,ప్రాచీన చరిత్ర తీయగేయాలి..అనే పరిస్థితి వస్తుంది.
మీకు తెలిసే ఉంటుంది...
* నవ్వడంవల్ల రక్తనాళాలు వ్యాకోచించి, రక్తప్రసారం పెరగడంతో ఇది గుండె సంబంధ వ్యాధులను నివారిస్తుంది.
* నవ్వడంవల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. తద్వారా క్యాన్సర్‌ కారణంగా దెబ్బతిన్న కణాల్ని బాగుచేసే శక్తీ నవ్వుకి ఉంది.
* నవ్వడంవల్ల ఆయుష్షూ పెరుగుతుంది. నోరంతా తెరిచి కళ్లకింద ముడతలు పడేలా బిగ్గరగా నవ్వేవాళ్లు నవ్వనివాళ్లకన్నా ఏడేళ్లు ఎక్కువగా జీవిస్తారట.
రోజుకి సుమారు 15 నిమిషాలు నవ్వితే దాదాపు 40 వరకూ క్యాలరీలు కరుగుతాయట.
ఇలా నవ్వు గురించి నవ్వుతూ బోల్డు చెప్పుకోవచ్చు..ఒక్కక్షణం మీరు అలోచించి ఈ పుస్తకంలోని కథలు చదివి.. నవ్వుతూ నవ్వు గురించి ఆలోచించండి..
నరుడా ఏమి నీ కోరికలో...
*నాలుకలు మొలుస్తున్నాయి
అతను అలవాటుగా భార్యను "ఒసే దేభ్యపు మోహాంధనా?అనబోయాడు.వాయిస్ ఎగ్జిట్ అవ్వక ముందే అతని నాలుక రెండు పార్టులైంది...ఓ బుల్లినాలుక మొలుచుకొచ్చింది...నగరమంతా నాలుకల ఫీవర్ మొదలైంది...వైరస్ లా...నాలుకలు మొలుస్తూనే వున్నాయి..ఎందుకలా?
*"ఖర్మ" కాలింది
"ఒరే పెళ్ళిచూపులకు వచ్చిన అంట్లవెధవ ...నీ చర్మం వలిచి నా హ్యాండ్ బ్యాగ్ చేసుకుంటాను వార్నింగ్ ఇచ్చింది.ఆ తర్వాత ఒకరి ఖర్మ మరొకరికి కాలింది..టోటల్ గా ఇద్దరికీ ఖర్మ కాలింది...
"నవ్వు"
"నవ్వడం పేద్ద గొప్పేమిటి?అన్నాడతగాడు ... "అయితే ఒకరోజంతా పాచిపోయిన పేస్ట్ లా కాకుండా కోల్గేట్ పేస్ట్ యాడ్ లా నవ్వి చూపించమంటూ.....సవాలు విసిరింది సుస్మిత...పందెం మొదలైంది..అతగాడికి నవ్వడం కూడా ఎంత కష్టమో తెలిసొచ్చింది..హౌ..ఎలా?
బాబోయి పెట్రోలు
ఇంకా మూడవనగరం సైబరాబాద్ ఏర్పడని రోజుల్లో జంటనగరాల్లో రోడ్డుమీద గుర్రాలు.ఎడ్లబండ్లు...పెట్రోలు బ్యాంకులు మూతబడి గుగ్గిళ్ల స్టాండ్లు అయ్యాయి.స్కూటర్లు కార్లు సమస్త ద్విచక్ర త్రిచక్ర చతురుచక్ర వాహనాలు తుక్కులో అమ్ముడుపోతున్నాయి...ఈ నగరానికి ఏమైంది?
బుచ్చిబాబుకు బుద్దొచ్చింది
పండక్కి అత్తారింటికి వెళ్లాల్సిన అల్లుడింటికి వచ్చిన మామ జపాన్ ప్రకృతి చికిత్స మొదలెట్టాడు.తర్వాతేమైంది?
జ్ఞానం
గోచినందస్వామి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనుకున్నాడు..తెలుసుకున్నాక అతను జీవితాంతం గోక్కుంటూనే వుండాలనుకున్నాడు.అపుడే హౌసోనర్ తిట్లదండకం వినిపించింది.తథాస్తుదేవతలు ఏంచేశారు?
అల్ రైట్స్ రిజర్వ్ డ్
పై ఫొటోల్ని వ్యక్తి ని నేను కొనుక్కున్న కారణంగా అన్ని హక్కులు నాకే చెంది వున్నాయి,ఇట్టి వ్యక్తితో లింకులు గట్రా పెట్టుకున్న,నా అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నా చట్టప్రకారం శిక్షార్హులు ..ఇట్లు మిసెస్ ముక్కంటి..ఆ దెబ్బతో నగరంలో చాలా మంది మొగుళ్ళ జీవితాల్లో హుధూద్ తుఫాన్ వచ్చింది...
నరుడా ఏమి నీ కోరిక!
పాతాళభైరవి ప్రత్యక్షమైంది "నరుడా ఏమి నీ కోరిక! అంది..అతను కోరుకున్నాడు..ఆ తర్వాత నెత్తీనోరూ బాదుకున్నాడు..ఎందుకలా జరిగింది?అంతగా డామేజీ జరిగే కోరిక ఎం కోరుకున్నాడు?
గోడదూకిన గోపాలం
అతను గోడదూకిన కారణం వేరు...గోడదూకాక జరిగిన దారుణం వేరు...పైగా మింగాలేడు కక్కాలేఢు..
మీ మైండ్ రిఫ్రెషర్ ఛాంబర్ లో రిలాక్స్ అయ్యేలా చేయండి...నరుడా ఏమి నీ కోరిక ఛానెల్ ని ట్యూన్ చేసుకోండి...నవ్వుతో కనెక్ట్ అవ్వనుంది...ఆయురారోగ్యాలతో ,చిరునవ్వుతో సెటిల్ అవ్వండి....
ఈ పుస్తకాన్ని ఒక్కసారి చదివేసి,మనస్ఫూర్తిగా నవ్వేసి,మరొకరికి,లేదా మరో నలుగురికి చెప్పేయండి.
ఈనాడు స్వాతి ఆంధ్రభూమి ఆంధ్రప్రభలో పత్రికల్లో వచ్చిన ప్రముఖరచయిత విజయార్కె కథలు మీ పెదవుల మీద చిరునవ్వును చూడాలన్న ఆకాంక్ష....

Preview download free pdf of this Telugu book is available at Naruda Emi Nee Korika