• Nalugu Prayogalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాలుగు ప్రయోగాలు

    Nalugu Prayogalu

    Publisher: Natali Prachuranalu

    Pages: 52
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగులో తొలి ప్రయోగంగా రారాజు అక్షరబద్ధం చేసిన “యం.ధర్మరాజు” ఏక పాత్రాభినయంలో ‘ఓ నటుడా నీకు సెల్యూట్’ అని నాటక ప్రియులు అనుకోక తప్పదు. ఎందుకంటే... వేలాది ప్రేక్షకులను మెప్పించి, వందల్లో బహుమతులు అందుకున్న ఆ యం.ధర్మరాజు చేతిలోని పాశమే ఆమె ప్రాణంతీసిందా? కాదు... కాదు... అతని తాపత్రయాన్ని ఆ పాశం లాగేసి జబ్బుతో బాధపడుతున్న తన భార్యకు సరైన వైద్యపరీక్ష లేక ప్రాణంతీస్తుంది. కాని ఆ మొహానికి వేసుకున్న రంగు మరో ప్రదర్శనకు సిద్ధం అవుతుంది.

“యూనియన్ లీడర్” – ఇది శ్రామికకుటుంబాల దారుణ వ్యవస్థకి రూపకల్పన! ఇదీ మా సమస్య అని గొల్లు గొల్లున గోడు వినిపించిన ఆ శ్రామిక జనానికి ‘మా నాయకుడు తప్పకుండా మా ఆశలు నెరవేరుస్తాడు’ అని అనుకునేలోపలే ‘లా’ అతన్ని లాక్కెళ్లిపోతుంది. అప్పుడు ఇంకేముంది? సామాన్యుని రోధన అరణ్యరోధనే అని చెప్పే ఇంకో మంచి ప్రయోగం ఇది!

“సత్” – దీన్ని స్వీయ నటనా నాటిక అన్నాడు – రారాజు అన్న కలం పేరున్న ఈ రచయిత! ఇదిమతసామరస్యం కోసం రాసిన మంచి ప్రయోగం! అసలు మతసామరస్యం ఎక్కడుంది? ఎలావుంది? అసలు మూలం ఎక్కడుంది? అదెలా తెలుస్తుంది? అదే ఆలోచించి తెలుసుకోండి! అప్పుడే మన భారతం నిండైన బంతిపూలతోట అవుతుంది.

రచయిత కలం నుండి జాలువారిన మరో మచ్చుతునక “మాయామయము” – ఇది అసలు సిసలైన ప్రయోగం! రంగస్థలం మీద నటుడు లేకుండా అది నాటకం ఎలా అవుతుంది? అని అనుకోవచ్చు, కాని ఇక్కడ అవుతుంది! అందుకే ఇది ప్రయోగం అయ్యింది! ఈ రంగస్థల ప్రయోగం కోసం, ప్రదర్శన కోసం అవగాహనా పూరిత రంగాలంకరణ, రంగోద్దీపనం కావాలి. దృశ్యానికి – అదృశ్యానికి మధ్య చక్కని గళం, భావపరంపరలు తెలిసిన గాయకుడు కావాలి. ఓ చంటిపిల్ల ఏడుపు, ఓ స్త్రీ గొంతు సమయానుకూలంగా వినిపించేలా శ్రద్ధ తీసుకుంటే, చూచిన ప్రేక్షకులు మెచ్చుకుంటే, ఓ ప్రదర్శకులారా మీరు ఎందుకు కారు ప్రదర్శనా రారాజులు!

- దవళ సన్యాసిరావు

Preview download free pdf of this Telugu book is available at Nalugu Prayogalu