• Nallamiriyam Chettu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    90
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నల్లమిరియం చెట్టు

    Nallamiriyam Chettu

    Pages: 244
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 premium votes.
Description

ఈ నవల ఒక గొప్ప ఆత్మగానం. పరివేదనా పత్రం. స్థలకాలాల చరిత్ర. దళితవర్గాల సంపద్వంతమైన ఆదిమ సంస్కృతి ప్రతిఫలనం. మాదిగ దండోరా నేపథ్యం నుంచి అది అల్లుకుంటున్న కాలంలో ఉన్న రాజకీయాల పరస్పర ఘర్షణల ఫలితాల దుఃఖతీవ్రతల నిలువుటద్దం. ఇది ఒక జాతి చరిత్ర. అనంత సౌందర్యంతో విరాజిల్లిన ఒక జాతి చరిత్ర. రాజకీయాలు పెనవేసిన జీవితాల, మాధుర్యాల, సౌందర్యాల, పోరాటల గని. రచయిత అనంత వ్యామోహంతో, ప్రేమతో, గొప్ప ఆరాధనతో, ఆశతో తవ్వుకుంటూ వెళ్లాడు. ఇది ఒక బాలెట్. ఒక ఓడ్. సమీప గతచరిత్రను ఒక మిత్‌లాగా - ఒక ఇతిహాసం లాగా సంభావించి నిర్మించిన కావ్యం ఇది.

డా. చంద్రశేఖరరావుగారి శిఖరాయమానమైన సృజన ఇది. ఎవరో అన్నట్లు, "ఏ కాలానికా కాలం తనకు కావల్సిన రచయితను, కవిని సృష్టించుకుంటుంది." ఈ మూడు దశాబ్దాల బహు సంకీర్ణ, సంక్షుభిత, సంక్లిష్ట సాంఘిక చరిత్రతో నిండిన కాలం చంద్రశేఖర రావును కన్నది. కాలం తనకు అప్పజెప్పిన పనిని అమోఘంగా నిర్వర్తించాడు. తెలుగు వచనానికి కొత్త రూపురేఖలను, కొత్త సౌందర్యాన్ని, కవిత్వంతో తులతూగే కాంతిని, సత్తువను, లోతును, చంద్రశేఖర రావు అందించాడు.

- కె. శివారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Nallamiriyam Chettu