• Nagarjuna Sagar Madhura Smrthulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాగార్జున సాగర్ మధుర స్మృతులు

    Nagarjuna Sagar Madhura Smrthulu

    Pages: 177
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నాగార్జున సాగర్‌ - సప్తాక్షర సంచయం, తీయని మాటలు, కమ్మని కలయిక, యింపు సొంపైన పదలాలిత్యం, రసమయమై, రాగమయమై, రంజిల్లే మధురాతి మధురమైన పేరు.

లక్షల ఎకరాలకు పంటనీరిస్తూ, ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు రైతులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, విద్యుత్‌ ఉత్పత్తి చేసి వెలుగులు పంచుతూన్న నాగార్జున సాగర్‌ ఆంధ్రుల అన్నపూర్ణ.

1955వ సంవత్సరం, డిసెంబర్‌ 10వ తేదీన పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ, నాగర్జున సాగర్‌కు శంకుస్థాపన చేయడం, ఆగస్ట్‌ 4, 1967న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలలోకి నీళ్ళు వదిలిన చారిత్రక ఘట్టాలు అందరికీ తెలుసు. అంతకు ముందు నాగార్జున సాగర్‌ని శంకుస్థాపన వరకూ తీసుకొచ్చిన ప్రముఖులో ముఖ్యులు, నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి, ప్రాజెక్టు కోసం ఉద్యమం సాగించి, సొంత డబ్బు లక్షన్నర ఖర్చుచేసి, సాధించి ప్రాజెక్టుల ప్రసాద్‌గా వాసికెక్కిన ముక్త్యాల సంస్థానం చివరి రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్‌గారి గురించి ఈ తరం వారికి తెలీదు. వారికి ఉద్యమంలో సహకరించిన డాక్టర్‌ కె.యల్‌. రావు, మోటూరి సత్యనారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య, నార్ల వెంకటేశ్వరరావు, ముళ్ళపూడి రామనాధం, ఏటూరి సీతాపతి, వారణాసి జ్వాలా నరసింహం, గొర్రెపాటి మొదలైన వారు చేసిన ఎనలేని కృషి తెలీదు.

శంకుస్థాపన తర్వాత కేవలం పదేళ్ళలో ఇప్పటివలె యంత్రసామాగ్రి అందుబాటులోలేని ఆ కాలంలో మానవ వనరులే ఆధారంగా, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, ఆఫీసు సిబ్బంది, ప్రాణాలు త్యాగం చేసి నిర్మించిన అద్భుత కట్టడం నాగార్జునసాగర్‌ డ్యామ్‌.

నీతి, నిజాయితీలే ఊపిరిగా జీవించిన ఇంజనీర్లు, ఇంకా వందలకొద్దీ శ్రామికులు నిబద్ధతతో ఎండ, వానా, చలి వంటివి లెక్క చెయ్యకుండ అహోరాత్రులు శ్రమించి నిర్మించిన త్యాగఫలం నాగార్జున సాగర్‌ డ్యామ్‌.

గడచిన చరిత్ర నిక్షిప్తపరచి ముందు తరాలకు అందించం మన కనీస కర్తవ్యం అని భావిస్తూ, అప్పటి నిర్మాణంలో పాల్గొన్న వారిని స్మరించుకోవడం కొరకు వీలైనంత వరకు వారి మధుర స్మృతులు సేకరించి ప్రచురించడం జరిగింది.

- సి.హెచ్‌. శివరామ ప్రసాద్‌, సంపాదకులు.

గమనిక: "నాగార్జున సాగర్ మధుర స్మృతులు" ఈ-బుక్ సైజ్ 15.7 MB

Preview download free pdf of this Telugu book is available at Nagarjuna Sagar Madhura Smrthulu