• Nadi Na Puttuka
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నది నా పుట్టుక

    Nadi Na Puttuka

    Pages: 58
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


సబ్బని సహజ కవిత్వ సంకలనం "నది నా పుట్టుక"
"If poetry comes not as naturally as the leaves to a tree it had better not come at all"
- John Keats (1795-1821)
కవిత్వం పుట్టుక గురించి ఇంత కన్నా గొప్పగా చెప్పనవసరం లేదనుకుంటాను అని భావించే కవి సబ్బని లక్ష్మీనారాయణ గారి కలం నుండి వెలువడిన మరో కవితా సంకలనం " నది నా పుట్టుక ".
కవిత్వం ఒక్కొక్కప్పుడు వ్యక్తిగతం, ఒక్కొక్కప్పుడు సామాజికం, కవి తన వ్యక్తిగత రూపాలను సమాజం లో చూసుకుంటాడు, ఇంకా ప్రకృతి లోని వివిధ రూపాలలో తనను తాను చూసుకుంటాడు. అలా విభిన్న పరిస్థితుల్లొ తన లోంచి వచ్చిన కవితా రూపాలే ఇవి అంటాడు సబ్బని.
తను నదిలా భావించి చెప్పుకున్న కవిత్వమే ఈ "నది నా పుట్టుక".
నదిలా ప్రవహించాలి నిండుగా
చెట్టులా బతుకాలి పరోపకారిలా
మహా సముద్ర ఘోషతో
బతుకును మోయాలి సహనంగా .... అంటూ మొదలిడి
...............................................
నది పాట, నది బాట , నది ప్రవాహం
సహజంగా, స్వేచ్చగా ఉంటుంది
నది ఒక సజీవ నాగరికత
నది ఒక పల్లెకో, పట్నానికో, నగరానికో మాత్రమే చెందదు
నది ఒక వర్గానికో, కులానికో, మతానికో మాత్రమే చెందదు
నది ఒక జాతికి, ఒక దేశానికి చెందుతుంది
అది తన ప్రవాహం జన ప్రవాహంతో కలిసి
నిదానంగా, సజీవంగా ప్రవహిస్తుంది
నది చరిత్రే నా చరిత్ర
నది పుట్టుకే నా పుట్టుక
నేను నదిని, నిరంతర ప్రవాహశీలిని …………
అంటూ సాగిన కవితా సంకలనంలో 50 విభిన్న అంశాలపై సహజమైన నది ప్రవాహ దోరిణిలో కవితలున్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Nadi Na Puttuka