• Naa Smruti Pathamlo Hemalatha Lavanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా స్మృతి పథంలో - హేమలతా లవణం

    Naa Smruti Pathamlo Hemalatha Lavanam

    Publisher: Vasavya Book House

    Pages: 472
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మా తల్లిదండ్రులు గోరా- సరస్వతీ గోరా నాస్తికత్వాన్ని ఒక నిర్మాణాత్మక జీవిత విధానంగా రూపొందించారు. వారి జీవితకాలంలో సామాజిక పరిస్థితులు, సాంఘిక, ఆర్థిక, నైతిక అసమానతలు వివిధ కోణాల నుండి మనుష్యులను చీలదీసి, అసమానతలతో మానవ విలువలు లోపించిన సామాజిక జీవితంగా ఉండేది.

సహజమైన ప్రవృత్తి గల గోరా మనుష్యుల మధ్యనే మెలుగుతూ తీవ్రంగా ఆలోచించారు. కులం, మతం, దైవభావం ఈ అసమానతలకు, అన్యాయాలకు, కష్టాలకు కారణంగా కనబడ్డాయి. గోరా తన జీవిత భాగస్వామి సరస్వతీ గోరాతో తన ఆలోచనలను, భావాలను పంచుకుంటూ చర్చిస్తూ వచ్చారు. ఇతరులతో కూడా తన ఆలోచనలు పంచుకుంటూ ఆలోచింపచేస్తూ వచ్చారు.

మాటకీ- చేతకీ సంబంధం ఉంటేనే సామాజిక సామరస్యం కొనసాగుతుంది. సమాజంలో నైతిక విలువలు ఉంటాయి. మనిషిని బాధ్యతగల వ్యక్తిగా మలచగలుగుతాము. దైవాధీనం అని పరాధీన, బానిస భావంలో వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించి కష్టాలను, బాధలను తొలిగించుకోవడం కుదరదు. అందుకే గోరా పరాధీనతకు మూలమైన దైవభావాన్ని, దాని మీద ఏర్పడిన వ్యవస్థల్ని వదిలి, నాస్తికత్వాన్ని నిర్మాణాత్మక జీవిత విధానంగా, మానవ కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాలలో సమానత, స్వేచ్ఛ, బాధ్యతగల విధానాలను, వ్యవస్థలను ఏర్పరచుకుంటూ ముందుకు నిరంతరం సాగాలనే ఆలోచనా ధోరణిని గోరా ప్రజల ముందు ఉంచారు.

సామాజిక జీవనంలో కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. గోరా, సరస్వతీ గోరా నిర్మాణాత్మక నాస్తిక జీవిత విధానంలో తమ పిల్లలను కుల, మత, లింగ అసమానతలు లేని స్వేచ్ఛా వాతావరణంలో పెంచుతూ బాధ్యతగల పౌరులుగా మెలిగేటట్లు చేయడానికి కృషి చేశారు.

గోరా - సరస్వతీ గోరాకు తొమ్మండుగురు సంతానం. లవణం రెండవ బిడ్డ. వారి పెంపకంలో పెరిగిన అన్నయ్య లవణం బాలుడుగా ఉన్నప్పటి నుండి యువకుడుగా, దేశ పౌరుడుగా, విశ్వ మానవుడుగా తన జీవితంలో నడచిన విధానం, తీసుకున్న కార్యక్రమాలు తను వ్రాసిన "స్మృతి పథంలో- లవణం" లో 1930-2005 వరకు పొందుపరిచారు.

- మైత్రి

Preview download free pdf of this Telugu book is available at Naa Smruti Pathamlo Hemalatha Lavanam