• Naa Pogaru Mimmalni Gaayaparichindaa Ayite Santosham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం!

    Naa Pogaru Mimmalni Gaayaparichindaa Ayite Santosham

    Pages: 203
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి ` నిరంతరం అవమానపరిచే ` గాయపరిచే ` హత్య చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా ` మన సాహిత్య వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో ` ఇలాంటి పుస్తకం రాయడం - ప్రచురించడం ఒక సాహసమే - ఆక్టోపస్‌లాగా, మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో - ప్రపంచ ప్రజలందరు తమ బలం, బలహీనతలను అంచనా వేసుకోవడానికి - ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాల్లో సమస్త కులాలు, సమస్త శక్తులు భుజం భుజం కలిపి పోరాడడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది......

ఈ పుస్తకం నా అంచనా ప్రకారంగా రెండు రకాలుగా ప్రతిస్పందనలు చెలరేగడానికి కారణం కాగలదనిపిస్తున్నది. దొంగకు తేలుకుట్టినట్లు ఈ పుస్తకాన్ని పట్టించుకోకపోడం. రెండోది వాయిలెంటు రియాక్షన్‌. ఇంతదూరం నడిచి కూడా - గోపి కత్తి అంచు మీదనే ఉన్నాడనిపిస్తుంది. ఇందులోని కొన్ని మాటలు మార్చవచ్చు. తొలగించవచ్చు- తద్వారా గోపికి మంచి పేరు రావచ్చు - మేధావిగా గుర్తింపు పొందవచ్చు - శత్రువులు తగ్గిపోవచ్చు... అయితే ఇది దృక్పథానికి సంబంధించిన సమస్య. ఇది లొంగిపోవడానికి, పోరాడటానికి సంబంధించిన సమస్య. లొంగిపోవడం ` పోరాడటం అనేవి మనిషి పుట్టుకతోనే దోపిడి సమాజాల్లో వెంటాడేవి. పోరాడటం గోపి నడక, ఆచరణ, నైజం....

- అల్లం రాజయ్య

* * *

అసంబద్ధమైన అసమానతమధ్య నలిగిపోయి తన జీవిత పోరాటాన్ని (బ్రతుకు దెరువూ, పరువూ, ప్రతిష్ఠల కోసం కాదు - సామాజిక న్యాయం కోసం) బేరీజు వేసుకున్న ప్రతి ఆలోచనాపరుడికీ ఏదో ఒక సమయంలో ఓ సందేహం రాక తప్పదు. దాన్ని డా॥ గోపీనాథ్‌ వ్యక్తీకరించిన తీరు గుండెలు పిండేస్తుంది.

- విద్యాసాగర్‌ అంగలకుర్తి

Preview download free pdf of this Telugu book is available at Naa Pogaru Mimmalni Gaayaparichindaa Ayite Santosham