• Naa Cycle Yatraa Darshanam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 194.4
    216
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా సైకిల్ యాత్రా దర్శనం

    Naa Cycle Yatraa Darshanam

    Author:

    Pages: 200
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హిమాలయాలు అధిరోహించడంకంటే, ఎడారుల్లో నడవడం కంటే, కొండలు, అడవులు, గుట్టలు ఎక్కడం కంటే అపారమైన, అద్వితీయమైన అనుభవమిది. ఇది సైకిల్ యాత్రొకటే కాదు. జీవితాన్ని వెతుక్కుంటూ ఏమీ తెలియని తనం నుండి జీవిత స్పృహలో కొచ్చిన యాత్ర కూడా. పడుతూలేస్తూ జీవితాల్లో ఓటమిని ఎలా జయించి విజయాలుగా మార్చుకోవచ్చో తెలియజేసే యాత్ర ఇది.

గమ్యం తెలియని యుద్ధఖైదీల్లాగా, చదువుల జైళ్ళలో ఖైదీల్లా మారిన పిల్లల కోసం చేసిన జైత్రయాత్ర. పోయిన జీవితం వృథాగా పోగా, మిగిలింది వ్యథలతోనో, కథలూ కాకరగాయలతోనో గడిచిపోయింది. ఇంకా మిగిలిన జీవితంలో ఎంతమంది పిల్లల్ని ఎన్ని రకాలుగా ఖైదు నుంచి బయటపడేయొచ్చో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండడానికి, నన్ను నేను వెన్ను తట్టి ధైర్యం చెప్పుకోవడానికి, నాకు అర్థమైన జీవిత సత్యాలను పదిమంచికి పంచడానికి చేసిన సైకిల్ యాత్ర. నిరంతరం పత్రికల్లో చదివే ఎంతో మంది కాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు చేసే సాహసాలను చదివిన తరువాత వాళ్ళు సృష్టించిన విన్యాసాలను చూసిన తరువాత, వాళ్ళ చరిత్రలు చదివిన తర్వాత అన్నీ సక్రమంగా ఉన్న మనం ఏమైనా చెయ్యొచ్చని ఋజువు చెయ్యాలనుకునేందుకు చేసిన సైకిల్ యాత్ర.

- మంచికంటి

Preview download free pdf of this Telugu book is available at Naa Cycle Yatraa Darshanam