• Naa Choopulo Iropa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా చూపులో ఐరోపా

    Naa Choopulo Iropa

    Author:

    Pages: 113
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం "నా చూపులో ఐరోపా" యాత్రా సాహితి. 'నేను చూసిన ఐరోపా' ' నా దృష్టిలో ఐరోపా' అని అనకుండా 'నా చూపులో' అనడం - కొత్తగా వుంది, బాగుంది. ఆదిభట్ల నారాయణ దాసుగారు తన స్వీయచరిత్రకి "నా యెఱుక" అని పేరు పెట్టారు. 'నా జ్ఞాపకాలు' అనడం కంటే 'నా యెఱుక' ఎంతో ముచ్చటగా వున్నట్లు - 'నా చూపులో' కూడా అంత ముచ్చటగా వుంది.

ఐతే ఎందరెందరో ఇవాళ అతి సులభంగా విదేశాలు పర్యటిస్తున్నారు. ఆ అనుభవాలు రాస్తున్నారు. చెబుతున్నారు. మరి ఇందులో ప్రత్యేకత ఏమిటి? అంటే ధర్మారావు గారు ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి, గ్రహించి రాసుకుని దానికి పుస్తక రూపం ఇవ్వడం! బస్సులు ఎక్కడం, షిప్పులు ఎక్కడం, విమానాలు ప్రతీదీ విడమరచి రాశారు. స్వతహాగా రచయిత గనక, చదువరికి చక్కగా, ఉత్సాహ భరితంగా వుండేలా రాశారు.

ఆయా దేశాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, భోజనాలు, కట్టుబొట్టు తీరు - ఇవన్నీ తెలియడానికే ఇలాంటి పుస్తకాలు రాస్తారు. అది నెరవేరింది. ఈఫిల్ టవర్, పీసా గోపురం మొదలైన వాటి గురించి చెబుతున్నప్పుడు అవి ఎప్పుడు నిర్మితమైనవీ సంవత్సరాలతో సహా చెప్పడం వల్ల - చరిత్ర తెలిసిపోతుంది. వేరే జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు వెతకనక్కర్లేదు. తులిప్ పుష్పోద్యాన శోభని కళ్ళకి కట్టినట్లు చెప్పారు.

ఇలాంటి యాత్రలో ఇబ్బందులుంటాయి. అవస్తలుంటాయి - తప్పదు. అవన్నీ తట్టుకోవాలి. అవీ రాశారు. ఇలా వివరంగా రాయడం వల్ల తెలియని వాళ్ళకి చాలా విషయాలు విపులంగా తెలుస్తాయి. మంచి పుస్తకం. తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి తెలుసుకోదగ్గంత వున్న పుస్తకం.

- రావి కొండలరావు

Preview download free pdf of this Telugu book is available at Naa Choopulo Iropa